సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... మహిళా ఆర్టిస్టులు అరెస్ట్...

సినిమాల్లో అవకాశాల కోసం స్కిన్ షోలు చేస్తున్న చాలా మంది హీరోయిన్లు... అప్పటికీ అవకాశాలు రాకపోతే... ఇలా సెక్స్ వర్కర్లుగా మారిపోతున్నారా?

news18-telugu
Updated: January 18, 2020, 5:38 AM IST
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... మహిళా ఆర్టిస్టులు అరెస్ట్...
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... మహిళా ఆర్టిస్టులు అరెస్ట్... (File)
  • Share this:
అది ముంబై... త్రీ స్టార్ హోటల్. ఎప్పుడూ సెలబ్రిటీలు వచ్చి పోతుంటారు. అలాంటి చోటికి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు. ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ... ఒక్కసారిగా దాడి చేశారు. హోటల్‌లోని ప్రతీ గదినీ తట్టారు. ఆ క్రమంలో... ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఓ మైనర్ నటి సహా ముగ్గుర్ని సెక్స్ రాకెట్ నుంచీ కాపాడారు. దీనంతటికీ కారణం మరో మహిళ (29) అని గుర్తించారు. అసలీ ఆపరేషన్ జరగడానికి ఓ ఫోన్ కాలే కారణం. రాత్రివేళ ఎవరో పోలీసులకు కాల్ చేశారు. అంధేరీలోని ఓ హోటల్‌లో వ్యభిచారం జరుగుతోందని చెప్పారు. ఇలాంటివి ముంబైలో కామనే కావడంతో... రొటీన్‌గా పోలీసులు... హోటల్‌కు వెళ్లారు. చెక్ చేశారు. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఐతే... దీన్ని నడిపిస్తున్న మహిళ ఎవరు? ఆమె ఎలా యువతుల్ని ఇందులో దించుతోంది అన్నది దర్యాప్తు చెయ్యగా కొత్త విషయం తెలిసింది.

కంది వ్యాలీలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తోంది ఆ మహిళ. తన దగ్గరకు టూర్ ప్యాకేజీలకు వచ్చే వాళ్లతో నైస్‌గా మాట్లాడేది. వాళ్ల వీక్ పాయింట్లను తెలుసుకునేది. వాళ్లకు బీర్ బాటిళ్లేనా... అమ్మాయిలు కూడా కావాలా అని అడిగేది. అదేంటి అలా అడుగుతున్నారని అంటే... ఊరికే జోక్ చేశా అనేది. అమ్మాయిలను కూడా సరఫరా చేస్తారా అని అడిగితే మాత్రం... అవసరాన్ని బట్టీ... అంటూ అసలు విషయం చెప్పేది.

ప్రస్తుతం ఆమె దగ్గర ముగ్గురు అమ్మాయిలు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఓ యువతి స్థానిక టీవీ ఛానెల్‌లో క్రైమ్ షోలో యాంకర్, మరో అమ్మాయి... ఓ వెబ్ సిరీస్‌లో నటించిన మైనర్ బాలిక, మరో ప్రముఖ నటి... మరాఠీ సినిమాలు, సీరియల్స్‌లో చేస్తోంది. వీళ్లు ముగ్గుర్నీ ఆ హోటల్‌లోని ఓ రూంకి తీసుకెళ్లింది ఆ మహిళ. అదే సమయంలో ఎటాక్ చేసిన పోలీసులు.. ఆ మహిళను అరెస్టు చేసి... ముగ్గురు అమ్మాయిలనూ రెస్క్యూ హోంకి తరలించారు. డబ్బు కోసం ఆమె ఈ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు