హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: బయటేమో మసాజ్ బోర్డు.. లోపలేమో అమ్మాయిలతో.. పోలీసుల రైడ్ లో షాకింగ్ విషయాలు..

OMG: బయటేమో మసాజ్ బోర్డు.. లోపలేమో అమ్మాయిలతో.. పోలీసుల రైడ్ లో షాకింగ్ విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: మసాజ్ చేస్తామని బయట బోర్డులు పెట్టారు. లోపల స్పా మసాజ్ కు ఒక్కొదానికి ఒక్కొరేటును ఫిక్స్ చేశారు. కాసేపటికి అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు.

కొన్ని రోజులుగా హోటల్ లో మసాజ్ (Spa centre) ముసుగులో అసాంఘీక కార్యకలాపాలు చేస్తున్నారని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో అధికారులు హోటల్ పై ప్రత్యేక నిఘా పెట్టడానికి పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారు.. ఖచ్చితమైన సమాచారం కోసం ఒక వ్యక్తిని కస్టమర్ మాదిరిగా సదరు హోటల్ కు పంపించారు. అప్పుడు పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.

పూర్తి వివరాలు.. ముంబైలోని (Mumbai) వర్లీ ప్రాంతంలోని హోటల్ లో స్పా ముసుగులో సెక్స్ రాకెట్ (Prostitution) నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక వ్యక్తిని కస్టమర్ లాగా అక్కడికి పంపారు. పోలీసుల సూచనల ప్రకారం.. అతను కస్టమర్ మాదిరిగా లోపలికి వెళ్లాడు. అక్కడ స్పా చేయడానికి వెయ్యిరూపాయలని మహిళ మేనేజర్ చెప్పింది.

ఆ తర్వాత.. మెల్లగా మాట్లాడుతూ.. అమ్మాయిలతో మసాజ్ (massage rocket)  కూడా చేయిస్తామని చెప్పింది. దీని కోసం అదనంగా మూడు వేలు చెల్లించాల్సి ఉంటుందని రేటు చెప్పింది. దీంతో అతను పోలీసులకు మెల్లగా సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత.. గదిలో ఉండగా పోలీసులు దాడిచేశారు. అక్కడ యువకులను, మహిళలను అదుపులోనికి తీసుకున్నారు. అక్కడ స్పా నిర్వహిస్తున్న మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ముగ్గురు మహిళలను వారి చెరనుంచి విడిపించి ప్రత్యేక వసతి గదులకు పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  దారుణం చోటు చేసుకుంది.

షాజహన్ పూర్ కు చెందిన 28 ఏళ్ల అమిర్ అనే వ్యక్తి స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ ను ప్రేమ (love)  పేరుతో వేధిస్తుండే వాడు. ఒకటే గ్రామానికి చెందిన వారు కావడంతో పలు మార్లు హెచ్చరించింది. ఈ క్రమంలో గత మే 4 న టీచర్ ను బైక్ పైన ఎక్కాలని అమిర్ కోరాడు. తెలిసిన వాడే కదా.. అని ఆమె ఎక్కింది.

ఆ తర్వాత కూల్ డ్రింక్ (Cool drink) ఇచ్చాడు. అది తాగగానే ఆమె మత్తులోనికి జారుకుంది. అతను ఇంట్లో తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత... మతం మారి పెళ్లి చేసుకొవాలని బెదిరింపులకు దిగాడు. అత్యాచారం (Rape) చేసిన వీడియో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో నిందితుని తల్లి, సోదరి, సోదరుడు, సమీప బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు.

First published:

Tags: Mumbai, Prostitution rocket

ఉత్తమ కథలు