హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘లేడీ పోలీస్ నన్ను టార్గెట్ చేస్తోంది..’.. ఆవేదన వ్యక్తం చేసిన లాయర్..

‘లేడీ పోలీస్ నన్ను టార్గెట్ చేస్తోంది..’.. ఆవేదన వ్యక్తం చేసిన లాయర్..

లేడీ పోలీస్ తో లాయర్ వాగ్వాదం

లేడీ పోలీస్ తో లాయర్ వాగ్వాదం

Mumbai: ఒక వ్యక్తి లేడీ పోలీస్ నన్ను కొన్ని నెలలుగా టార్గెట్ చేస్తోందని, పోలీసుల ఎదుట రచ్చచేశారు. అంతే కాకుండా లేడీ పోలీసుపై దాడికి కూడా ప్రయత్నించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

దేశ రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన సంభవించింది. ఒక వ్యక్తి నో పార్కింగ్ జోన్ లో స్కూటీపెట్టాడు. దీంతో లేడీ పోలీసు, మరో సిబ్బందితో కలిసి వెహికిల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా అతను స్టేషన్ లోనే పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది.

ముంబైలోని నలసోపరాలోని పాటన్ కర్ పార్క్ లో బ్రజేష్ కుమార్ అతని భార్య డాలీ కుమారి సింగ్ పోలీసు స్టేషన్ లో రచ్చ చేశారు.

బ్రజేష్ పోలీసుల ఆధీనంలో ఉన్న తన స్కూటీని బైటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించాడు. కాగా, అతున.. మహిళ పోలీసు ప్రజ్ఞా శివరామ్ దల్వీని దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆమె కొన్నినెలలుగా కావాలనే నన్ను టార్గెట్ చేసిందని వాపోయాడు. దీంతో అతను ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ఘర్షన తలెత్తింది. దీంతో అక్కడున్న వారు ఇతడిని సముదాయించారు. లేడీపోలీసుపైన తానుకూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.

లేడీ పోలీసుతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి ఒక లాయర్. అతడిని గొడవకు దిగకుండా భార్య సర్ది చెప్పింది. కానీ ఇద్దరు వాదులాడుకున్నారు. పోలీసులు వచ్చి, భెలౌరియా అనే వ్యక్తిని స్టేషన్లోకి తీసుకెళ్లారు.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఓ బైకర్(Biker)తన టూవీలర్‌(Two wheeler)ని కారు(Car)గా మార్చేశాడు.

అంటే రెండు టైర్లకు బదులు నాలుగు టైర్లు అమర్చి దానికి క్యాబిన్ ఏర్పాటు చేయలేదు. ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగిన బైక్‌పై తాను కాకుండా మరో ఐదుగురు పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్తాడు. రోడ్డుపైన ఇంత వెరైటీ దృశ్యం కనిపిస్తే ఎవరు వదిలేస్తారు చెప్పండి అందుకే కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌(Cell phone)తో వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశాడు. అంతే ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్(Video viral) అవుతోంది. బైకర్ చేసిన స్టంట్‌ చూసి అందరూ ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలో ఓ బైకర్‌ తన టూవీలర్‌పై ఐదుగురు పిల్లల్ని ఎక్కించుకున్నాడు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. తాను డ్రైవ్ చేస్తూ తన ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఇద్దర్ని కూర్చొబెట్టుకున్న యువకుడు తన వెనుక మరో ముగ్గుర్ని కూర్చొబెట్టుకున్నాడు. ఝాన్సీలోని బాలాజీ రోడ్డులో ఈవిధంగా ఆరుగురు ఒకే బైక్‌పై వెళ్తుండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సిప్రీ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కి అత్యంత సమీపంలోనే ఈసంఘటన చోటుచేసుకోవడం విశేషం.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Mumbai, Police

ఉత్తమ కథలు