Home /News /crime /

MUMBAI MAN TEAR PASSPORT PAGE TO HIDE MALDIVES TRIP WITH GIRLFRIEND FROM WIFE ARRESTED PVN

Husband Caught : పెళ్లానికి తెలియకుండా ప్రియురాలితో ఫారిన్ లో ఎంజాయ్..ఆ ఒక్క పనితో మెత్తం గుట్టు రట్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Husband Caught : భార్యకు మాయమాటలు చెప్పి ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఫారిన్ వెళ్లిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పాస్ పోర్ట్ లో చిరిగిన ఓ పేజీ వల్లే అతడి గుట్టు బయటపడింది.

    Husband Caught : భార్యకు మాయమాటలు చెప్పి ప్రియురాలితో(Girlfriend) ఎంజాయ్ చేసేందుకు ఫారిన్ వెళ్లిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పాస్ పోర్ట్ లో చిరిగిన ఓ పేజీ వల్లే అతడి గుట్టు బయటపడింది. అతను ముంబై విమానాశ్రయానికి(Mumbai Airport) తిరిగి వచ్చినప్పుడు, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో అతని పాస్‌పోర్ట్‌(Passport)లో కొన్ని పేజీలు లేవు. అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు అతడిని అధికారులు అరెస్టు చేశారు.

    అసలేం జరిగిందంటే

    ముంబైకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి వృత్తిరీత్యా ఇంజనీర్. ముంబైలోనే ఓ MNC(మల్టీ నేషనల్ కంపెనీ) కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాడు. ప్రియురాలిని కలిసేందుకు మాల్దీవులకి వెళ్లాడు. మాల్దీవుల్లో ప్రియురాలితో కొద్ది రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. అయితే ఈ సమయంలో అతని భార్యకు అనుమానం వచ్చింది. ఆమె ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ ని అతడు ఎత్తలేదు. దీని తర్వాత, తన భార్య నుండి విదేశీ ప్రయాణ విషయాన్ని దాచడానికి, అతను పాస్ పోర్ట్ నుండి పేజీలను తొలగించాడు. ఇంటికి తిరిగొచ్చాక తన పాస్ పోర్ట్ చూస్తే తాను మాల్దీవులకి వెళ్లానని తెలుస్తోందని తన పాస్ పోర్ట్ లో ట్రావెల్ వీసా స్టాంప్ ఉన్న పేజీలని చింపేసి ముంబైకి తిరుగుపయనమయ్యాడు.

    Tongue Color : మీ నాలుక రంగు మారిందా..ఆ రంగులోకి మారితే గుండె జబ్బుకు సంకేతం!



    గురువారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. ముంబై విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో అతని పాస్‌పోర్ట్‌లో . అతని తాజా ట్రావెల్ వీసా స్టాంప్‌ని కలిగి ఉండే పేజీలు లేవు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పాస్‌పోర్ట్‌ ను ట్యాంపరింగ్ చేయడం నేరమని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిని మోసం, ఫోర్జరీతో సహా సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. పోలీసులు అతడిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, రూ.25,000 పూచీకత్తుపై విడుదల చేశారు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Husband, Mumbai, Passport, Wife and husband

    తదుపరి వార్తలు