పురుషుడిపై గ్యాంగ్ రేప్.. ప్రాణాపాయ స్థితిలో బాధితుడు..

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి పూట ఓ వ్యక్తిని సిగరెట్ కావాలని అడిగి, అతడ్ని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుర్మార్గులు. అంతేకాదు.. అతడ్ని శారీరకంగా హింసించి, వెనుక నుంచి ఎండిన కొబ్బరి చిప్పను శరీరం లోపలికి దూర్చారు.

news18-telugu
Updated: September 27, 2019, 11:34 AM IST
పురుషుడిపై గ్యాంగ్ రేప్.. ప్రాణాపాయ స్థితిలో బాధితుడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి పూట ఓ వ్యక్తిని సిగరెట్ కావాలని అడిగి, అతడ్ని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుర్మార్గులు. అంతేకాదు.. అతడ్ని శారీరకంగా హింసించి, వెనుక నుంచి ఎండిన కొబ్బరి చిప్పను శరీరం లోపలికి దూర్చారు. నవీ ముంబైలోని వసీలో రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి(36) ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాగర్ విహార్ లేక్ వద్ద అతడ్ని ఆపి సిగరెట్ అడిగారు కొందరు డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు. ఇంతలో.. అతడ్ని కిడ్నాప్ చేసి చెట్ల చాటుకు తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు. అనంతరం అతడి పురుషాంగంపై దాడి చేసి, వెనుక భాగం నుంచి లోపలికి ఓ కొబ్బరి చిప్పను దూర్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడ్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతడికి సర్జరీ చేసి కొబ్బరి చిప్పను తొలగించారు. ప్రస్తుతం బాధితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన 25-30 ఏళ్ల యువకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు