రూ.5 కోసం వృద్ధుడి దారుణ హత్య.. నడిరోడ్డుపై కొట్టి చంపేశారు..

డబ్బులు చెల్లించిన అనంతరం తనకు రావాల్సిన 5 రూపాయల చిల్లర అడిగాడు. అందుకు స్టేషన్ సిబ్బంది నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది.

news18-telugu
Updated: February 26, 2020, 5:11 PM IST
రూ.5 కోసం వృద్ధుడి దారుణ హత్య.. నడిరోడ్డుపై కొట్టి చంపేశారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేవలం ఐదు రూపాయల కోసం హత్య చేశారు. ఏ మాత్రం జాలి దయ లేకుండా నడిరోడ్డుపై కొట్టి చంపేశారు. ముంబైలోని బోరివాలి ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామ్ దులర్ సింగ్ (68) అనే వృద్ధుడు స్థానికంగా ఉన్న మాగథానె గ్యాస్ స్టేషన్‌కు వెళ్లి తన వాహనంలో CNG గ్యాస్ నింపించుకున్నాడు. డబ్బులు చెల్లించిన అనంతరం తనకు రావాల్సిన 5 రూపాయల చిల్లర అడిగాడు. అందుకు స్టేషన్ సిబ్బంది నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే గ్యాస్ స్టేషన్‌లో పనిచేసే కొందరు వ్యక్తులు రామ్‌దులర్ సింగ్‌ను చుట్టి దాడి చేశారు. వృద్ధుడనే కనికరం కూడా లేకుండా దారుణంగా కొట్టారు. అనంతరం అక్కడి నుంచిపారిపోయారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన రామ్ దులర్ సింగ్ కాసేపటికే చనిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రామ్ దులర్ సింగ్ కుమారుడి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు