ఇంటి ముందు మూత్ర విసర్జన.. అడ్డుకున్నందుకు దారుణ హత్య

కోపంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి పదునైన ఆయుధంతో భార్యాభర్తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భర్త అక్కడికక్కడే చనిపోగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

news18-telugu
Updated: November 1, 2019, 8:40 PM IST
ఇంటి ముందు మూత్ర విసర్జన.. అడ్డుకున్నందుకు దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకూడదు. కానీ అతడు మాత్రం ఏకంగా జనావాస ప్రాంతాల్లో.. అది కూడా ఓ ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడు. అడ్డుకున్నఇంటి యజమానిని చంపేశాడు. ముంబై ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 45 ఏళ్ల నందలాల్ రామ్‌దేవ్ కనోజియా, అతడి భార్య గోరెగావ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారి ఇంటి ముందు అమిత్ సౌరవ్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. అది చూసి ఇంటి యజమాని నందలాల్ రాందేవ్.. అతడితో గొడవ పెట్టుకున్నాడు. మా ఇంటి మూత్రం పోస్తావా.. సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. భార్యభర్తలు ఇద్దరు కలిసి అతడితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే కోపంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి పదునైన ఆయుధంతో భార్యాభర్తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భర్త అక్కడికక్కడే చనిపోగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>