హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: తిక్క కుదిరింది.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని మహిళ ఏంచేసిందో తెలుసా..?

Shocking: తిక్క కుదిరింది.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని మహిళ ఏంచేసిందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai crime: యువకుడు మహిళను వెంబడించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా మహిళను చూస్తు విజిల్స్ వేస్తు ఇబ్బందులకు గురిచేశాడు.

Man  harassing passing lewd comments at woman: దేశంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. అయినప్పటికి కొందరు కేటుగాళ్లు మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్లను వేధిస్తు, వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కామాంధులు.. పసికందు నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. ఇలాంటి వేధింపుల ఘటనలు ప్రతి చోట సంభవిస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలోని అందేరీ పశ్చిమ ప్రాంతంలో దారుణం జరిగింది. ఒక మహిళను గోవింద్ చవాన్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. సదరు యువతి తన స్నేహితురాలికి కలవడానికి స్థానికంగా ఉన్న అపార్ట్ మెంట్ దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో తిరిగి వెళ్తుండగా.. గోవింద్ చవాన్ ఆమెను వెంబడించాడు. ఆమె ఎక్కిన ఆటోలోనే ఎక్కాడు. ఆమెను పక్కన కూర్చుని ,  చూస్తు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత  విజిల్ వేశాడు. దీంతో ఆ యువతి, ఒక్కసారిగా భయపడిపోయింది.  చవాన్ వేధింపులను పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Woman Gangraped In UP's Shahjahanpur

ప్రస్తుతం మహిళలపై ప్రతిరోజు అఘాత్యాలు జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు.. దిశ, నిర్భయ వంటి ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన కొందరు నీచులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళను ఐదుగురు కామాంధులు ఇంటిలోపలికి లాక్కెళ్లారు. ఆ తర్వాత.. ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో మిగతా వారు ఘటనను తమ సెల్ ఫోన్ లో బంధించారు. ఈ ఘటన ఏప్రిల్ 22 న జరిగినట్లు బాధితురాలు తెలిపింది. ఘటన తర్వాత .. బాధితురాలిని నిందితులు బెదిరించారు.

పోలీసులకు చెబితే వీడియో వైరల్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో మరోసారి నిందితులు వేధింపులకు పాల్పడటంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. కాగా, ఈ దారుణానికి చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకొవడానికి  ప్రత్యేక  పోలీస్ టీమ్ లను రంగంలోనికి దింపారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Harassment, Harassment on women, Mumbai

ఉత్తమ కథలు