హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mumbai: కన్నోళ్ల కాళ్లకు దణ్ణం పెడుతున్నాడని మంచోడనుకునేరు.. ఈ కొత్త పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలిస్తే..

Mumbai: కన్నోళ్ల కాళ్లకు దణ్ణం పెడుతున్నాడని మంచోడనుకునేరు.. ఈ కొత్త పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలిస్తే..

రూపేష్ మోహిత్ పెళ్లి ఫొటో

రూపేష్ మోహిత్ పెళ్లి ఫొటో

ముంబైలోని బొరివ్లి వెస్ట్‌కి చెందిన రూపేష్ మోహిత్ బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్స్ కొరత ఉందని గుర్తించాడు. ఆ ఇంజక్షన్స్ బ్లాక్‌లో అమ్ముతానని తనకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలామందిని నమ్మబలికాడు. ఎవరైనా ఈ ఇంజక్షన్స్ కోసం అవసరమైన వాళ్లు ఉంటే తన నంబర్ ఇవ్వాలని చెప్పాడు.

ఇంకా చదవండి ...

  ముంబై: ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతుంటే, మరోపక్క బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. మనిషి ప్రాణాల మీదకు వచ్చిన సందర్భంలో కూడా కొందరు కొత్త దందాకు తెరలేపుతున్నారు. బ్లాక్ ఫంగస్ పేషంట్లకు ఇచ్చే యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్స్ అక్రమ దందాకు తెరలేపారు. ముంబైలో యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్స్ బ్లాక్‌లో తెప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.80 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడిన 27 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ డబ్బును ఆ యువకుడు తన పెళ్లి ఖర్చులకు వాడుకోవడం ఈ చీకటి దందాలో మరో ట్విస్ట్. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బొరివ్లి వెస్ట్‌కి చెందిన రూపేష్ మోహిత్ బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్స్ కొరత ఉందని గుర్తించాడు. ఆ ఇంజక్షన్స్ బ్లాక్‌లో అమ్ముతానని తనకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలామందిని నమ్మబలికాడు. ఎవరైనా ఈ ఇంజక్షన్స్ కోసం అవసరమైన వాళ్లు ఉంటే తన నంబర్ ఇవ్వాలని చెప్పాడు. ఈ క్రమంలోనే.. రౌనక్ అగర్వాల్ అనే వ్యక్తి తన 41 ఏళ్ల అంకుల్‌కు బ్లాక్‌ ఫంగస్ సోకడంతో ఆయనను ఇండోర్‌లోని డీఎన్‌ఎస్ హాస్పిటల్‌లో చేర్పించాడు. యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్స్ కావాలని.. తమకు కొరత ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో తనకు తెలిసిన ఫ్రెండ్ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తుండటంతో అతనికి కాల్ చేశాడు. అయితే.. అతని ఫ్రెండ్ రౌనక్‌కు మోహిత్ నంబర్ ఇచ్చి అతను కచ్చితంగా యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్స్ అందించగలడని.. అయితే బ్లాక్‌లో అమ్ముతున్నాడని చెప్పాడు. అవసరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయినా పర్లేదనుకుని మోహిత్‌కు కాల్ చేశాడు. ఒక్కో డోస్ రూ.6000 అవుతుందని మోహిత్ రౌనక్‌కు చెప్పాడు.

  డాక్టర్లు తనతో 60 డోస్‌ల ఇంజక్షన్ కావాలని చెప్పారని రౌనక్ మోహిత్‌తో చెప్పగా.. తాను ఎన్ని డోస్‌లైనా అమ్ముతానని కానీ మొత్తం డబ్బులో కొంత అడ్వాన్స్‌గా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో.. లక్షా 80వేల రూపాయలను అడ్వాన్స్‌గా అతని బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశానని రౌనక్ తెలిపాడు. తన అంకుల్ పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో ఇంజక్షన్స్ వెంటనే పంపాలని కోరానని, అయితే మోహిత్ మాత్రం రేపుమాపంటూ దాటవేశాడని.. మే 25న మోహిత్‌కు డబ్బు పంపగా.. మే 27న ఇంజక్షన్స్ పంపిస్తానని చెప్పాడని.. కానీ ఆరోజు ఫోన్ చేస్తే ఏవేవో సాకులు చెప్పి కొంచెం ఆలస్యమయ్యేలా ఉందని మోహిత్ చెప్పాడని.. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించానని రౌనక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

  ఇది కూడా చదవండి: Bangalore: యాభై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమెను రూ.80 లక్షలకు ముంచేశాడు..!

  తనకు ఇంజక్షన్స్ వద్దని, తన డబ్బు తనకు తిరిగిచ్చేయాలని మోహిత్‌ను అడగ్గా.. అందుకు అతను తిరస్కరించాడని.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రౌనక్ చెప్పాడు. పోలీసులు రౌనక్ ఫిర్యాదు మేరకు మోహిత్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రూపేష్‌ మోహిత్‌ను ఆ డబ్బు ఏదని అడగ్గా.. పెళ్లి ఖర్చులకు వాడుకున్నానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇలా.. మోహిత్ మరో ఇద్దరు, ముగ్గురిని కూడా మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Black Fungus, Cheating, Crime news, Mumbai

  ఉత్తమ కథలు