Home /News /crime /

MUMBAI MAN FLASHES PRIVATE PARTS AT WOMAN HR CONSULTANT IN LOCAL TRAIN ACCUSED IN POLICE NET PAH

ఛీ.. ఛీ.. ఇదేం పైశాచికం రా నాయన.. రద్దీగా ఉన్న ట్రైన్ లో మహిళను ఏంచేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: లోకల్ ట్రైన్ లో యువకుడు వికృత చర్యలకు పాల్పడ్డాడు. మహిళ వెనక వైపుగా వెళ్లి నిల్చున్నాడు. అంతటితో ఆగకుండా నీచపు పనులకు ఒడిగట్టాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India
కొంత మంది నీచులు.. ఒంటరిగా అమ్మాయిలు, మహిళలు కన్పిస్తే చాలు రెచ్చిపోతుంటారు. వెంట పడి మరీ దారుణాలకు పాల్పడుతుంటారు. గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్ లో మహిళలకు భద్రత లేకుండా పోయింది. చివరకు పోలీసు స్టేషన్ లో కూడా మహిళలపై అత్యాచార ఘటనలు వార్తలలో నిలిచాయి. లోకల్ ట్రైన్ లో (Local Train)  రద్దీగా ఉన్న జనాల మధ్య ఒక వ్యక్తి మహిళ పట్ల చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలోని (Mumbai) లోకల్ ట్రైన్ లో అమానవీయకర ఘటన జరిగింది. స్థానిక మహిళ తన భర్త,పిల్లలతో కలిసి, కల్యాణ్ రైలు ఎక్కారు. అక్కడ నుంచి దాదర్ కు బయలు దేరారు. అప్పుడు ట్రైన్ అంతా ఫుల్ రష్ గా ఉంది. భర్తకు, పిల్లలకు ప్లేస్ దొరికింది. కానీ మహిళకు మాత్రం దొరకలేదు. దీంతో ఆమె ట్రైన్ లో నిల్చోని ఉంది. అప్పుడు ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. మహిళ.. ప్రైవేటు భాగాలను తన సెల్ ఫోన్ తో ఫ్లాష్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను తడుముతు.. జుగుప్సకరంగా ప్రవర్తించాడు. దీన్ని చుట్టుపక్కల వారు కూడా గమనించారు.



వెంటనే అతడిని పట్టుకుని చితకొట్టారు. మహిళ కూడా అతగాడిని చెప్పుతీసుకుని కొట్టింది. మహిళ స్థానిక ప్రైవేటు కంపెనీలో.. హెచ్ ఆర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. వెంటనే తోటిప్రయాణికులు అతడిని బంధించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. కాగా, నిందితుడు.. బైకుల్లా నివాసి అయిన.. ఏఏ అన్సారీ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా  ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది.

స్థానికంగా ఉండే ప్రీతి శర్మ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది. ఆమెకు.. ఫిరోజ్ అలియాస్ చ్వానీ (23) తో పరిచయం ఏర్పడింది. నాలుగెళ్ళుగా అతడితోనే జీవిస్తుంది. అయితే.. ఈ మధ్య కాలంలో.. ప్రీతిశర్మ తనను పెళ్లి చేసుకొవాలని, ఫిరోజ్ ను కోరింది. అయితే.. దాన్ని అతగాడు దాటవేస్తు వచ్చాడు. అప్పుడు చివరకు తమ కులాలు వేరే అందుకు తమ ఇంట్లో ఒప్పుకొవట్లేదని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అంతటితో ఆగకుండా.. నీ క్యారెక్టర్ లేదంటూ మహిళను నోటికొచ్చినట్లు దూషించాడు. ఈ క్రమంలో.. మహిళ కోపంతో రేజర్ తీసుకుని అతగాడి గొంతు కోసేసింది. ఆ తర్వాత.. ఒక గొనె సంచిలో వేసుకుని, ట్రాలీలో శవాన్ని పెట్టుకుని.. నదిలో పాడేయడానికి వెళ్తుంది. అప్పుడు అక్కడ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహిళ ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో ఆమె దగ్గరకు వెళ్లి ఆరాతీశారు. సంచి ఓపెన్ చేసి చూశారు. అప్పుడు దానిలో చనిపొయిన వ్యక్తి కన్పించాడు. వెంటనే ఆమెను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అదే విధంగా.. నేరం కోసం నిందితులు ఉపయోగించిన రేజర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు