సినీ నటిపై లైంగిక వేధింపులు... కోర్టు సంచలన తీర్పు

ముంబైకి చెందిన అతను... బాలీవుడ్ నటి (బాధితురాలు) ఓ విమానంలో ప్రయాణిస్తుండగా... లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పట్లో ఆమె మైనర్. అతన్ని ప్రత్యేక పోక్సో కోర్టు దోషిగా గుర్తించింది.

news18-telugu
Updated: January 15, 2020, 2:30 PM IST
సినీ నటిపై లైంగిక వేధింపులు... కోర్టు సంచలన తీర్పు
బాలీవుడ్ నటిపై లైంగిక వేధింపులు... కోర్టు సంచలన తీర్పు
  • Share this:
41 ఏళ్ల కన్సల్టెంట్ వికాస్ సచ్‌దేవను పోక్సో చట్టం, IPC సెక్షన్ 354 కింద పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. ఈ తీర్పు ప్రకటించినప్పుడు అతను, అతని భార్య... కోర్టులోనే కుప్పకూలారు. శిక్ష ఖరారుపై త్వరలో వాదనలు జరగనున్నాయి. తను మైనర్‌గా ఉన్నప్పుడు... విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు వికాస్ సచ్‌దేవ... తన వెనక సీట్లో కూర్చున్నాడన్న ఆ బాలీవుడ్ నటి... తన సీటుకి ఉన్న ఆర్మ్‌రెస్టుపై అతని కాలును పెట్టి... తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఐతే... ఆ సమయంలో విమానంలో సాక్షులుగా ఉన్న ఏడుగురిలో... ముగ్గురు (ఓ ప్రయాణికుడు, ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది)... సచ్ దేవ విమానం వెళ్లినంతసేపూ నిద్రపోతూనే ఉన్నాడని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో... నిందితుణ్ని గుర్తించేందుకు చాలాసార్లు బాధితురాలిని పిలిచినా... ఆమె రాలేదు. పైగా 2018లో ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ని బట్టీ... ఆమె లేనిపోనివి ఊహించుకుందనే వాదనను నిందితుడి తరపు లాయర్ వాదించారు.

డిప్రెషన్ తగ్గేందుకు రోజూ 5 టాబ్లెట్లు తీసుకుంటున్నానన్న నటి... టెన్షన్ తగ్గట్లేదనీ, అర్థరాత్రి వేళ హాస్పిటల్‌కి వెళ్తన్నాననీ, అంతా శూన్యంగా అనిపిస్తోందనీ, విశ్రాంతి లేదనీ, ఏవేవో ఊహలు వస్తున్నాయనీ, అతిగా నిద్రపోవడం, అసలు నిద్రే పోకుండా గడపడం వంటివి జరుగుతున్నాయనీ, వికారం, ఒళ్లు నొప్పులు, సూసైడల్ ఆలోచనలు వస్తున్నాయని... 2018లో ఆ నటి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రాసుకుంది. దీన్ని బట్టీ... ఆమెపై ఎలాంటి లైంగిక దాడీ జరగలేదని నిందితుడి తరపు లాయర్ వాదించారు.

నిందితుడి భార్య (ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు) కూడా అతన్నే సమర్థించింది. ఓ అంత్యక్రియల కార్యక్రమం కోసం ముంబై నుంచీ ఢిల్లీకి విమానంలో వెళ్లిన తన భర్త... ఆ ప్రయాణం మొత్తం నిద్రపోయారని తెలిపారు. అయినప్పటికీ... బాధితురాలి (బాలీవుడ్ నటి) సీటుకి ఉన్న ఆర్మ్‌రెస్టుపై సచ్ దేవ... కాలు పెట్టారు కాబట్టి... లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగానే భావిస్తున్నామని కోర్టు తెలిపింది. ఇప్పుడు సచ్‌దేవకు ఎలాంటి శిక్ష విధిస్తుందన్నదానిపై చర్చ జరుగుతోంది.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు