ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటెల్లో విదేశీ మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడో ఉద్యోగి. కెనడాకు చెందిన 32 ఏళ్ల సుమిత్ రావ్ అనే మహిళ... జనవరి 5న ముంబై జుహు ఏరియాలో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హెటెల్లో బస చేసింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహించే సదరు మహిళ... హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఓ హోటెల్ ఉద్యోగి లోపలికి వచ్చాడు. అనుమతి లేకుండా గదిలోకి రావడమే కాకుండా... సెల్ఫీ కావాలని అడిగాడు. హఠాత్తుగా హెటల్ గదిలోకి వచ్చిన ఉద్యోగిని చూసి షాక్‌కు గురైన సుమిత్ రావ్... అతన్ని బయటికి వెళ్లాలని గట్టిగా అధమాయించింది. దాంతో ఆమెను అసభ్యంగా తాకుతూ కౌగిలించుకున్నాడు ఆ హోటల్ ఉద్యోగి. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
హోటల్ యాజమాన్యానికి తనకు జరిగిన చేదు అనుభవం గురించి వివరించిన సుమిత్ రావ్... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. సెక్షన్ 354, 354 (d) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేస్తున్నారు. ఇంతకు ముందు చాలాసార్లు ఇండియాకు వచ్చానని, కానీ ఎప్పుడూ తనకిలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని సుమిత్ రావ్ వెల్లడించడం విశేషం.
ఇవి కూడా చదవండి...
గోవాలో దారుణం... 15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా... ఆమె అత్త ఇంట్లోనే...
‘మానవత్వమా నువ్వెక్కడ’... 17 ఏళ్ల వయసులో తల్లి శవాన్ని సైకిల్‌పై
16 ఏళ్ల బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ కేసు... ఆ 8 మంది ఎక్కడ...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime