హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mumbai drugs: డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ఖాన్​కు రాని బెయిల్​.. నేడు మరోసారి పిటిషన్​ విచారణ

Mumbai drugs: డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ఖాన్​కు రాని బెయిల్​.. నేడు మరోసారి పిటిషన్​ విచారణ

ఆర్యన్ ఖాన్ (Aryan Khan)

ఆర్యన్ ఖాన్ (Aryan Khan)

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ (drugs) పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ పిటిషన్‌ను రేపటికి (బుధవారం) వాయిదా వేసింది ముంబై హైకోర్టు

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ (drugs) పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan khan) కు మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ పిటిషన్‌ను ముంబై హైకోర్టు (Mumbai high court) బుధవారం వాయిదా వేసింది . బెయిల్ పిటిషన్ అక్టోబర్ 27న విచారణకు రానుంది. అయితే ఇదే కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ (bail) లభించింది. ఈ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక ఎన్‌డీపీఎస్ (NDPS) కోర్టు అనుమతించింది. అవిన్ సాహు, మనీష్‌లకు బెయిల్‌ దొరికింది. ఆర్యన్, అర్బాజ్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి.

ఎన్‌డీపీఎస్ చట్టం..

అక్టోబర్ 20న జరిగిన విచారణలో ఎన్‌డీపీఎస్ చట్టం (NDPS law) కింద బెయిల్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో ఆర్యన్ ఖాన్ వెంటనే హైకోర్టు (high court)ను విచారణకు తరలించారు. మేజిస్ట్రేట్ కోర్ట్, సెషన్స్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆర్యన్ ఖాన్ తరపు తరఫు వాదనలు వినిపించేందుకు  మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ (Mukul Rohathgi) మంగళవారం హాజరయ్యారు.

వాడివేడి వాదనలు..

బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్యన్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసిందని ఆయన తరపున వాదనలు విన్పించారు మాజీ అటార్నీ జనరల్ ముకుల్‌ రోహత్గీ. క్రూయిజ్‌లో పార్టీకి గెస్ట్‌గా మాత్రమే ఆర్యన్‌ వెళ్లాడన్నారు. ప్రతీక్‌ గబ్బా ఆహ్వానం మేరకే క్రూయిజ్‌ పార్టీకి ఆర్యన్‌ వెళ్లినట్టు తెలిపారు. ఆర్యన్‌ ఫ్రెండ్‌ ఆర్భాజ్‌ దగ్గర షూస్‌లో 6 గ్రాముల చరస్‌ దొరికిందన్నారు. ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసి 23 రోజులయ్యిందని, ఇప్పటికి కూడా ఎన్సీబీ ఆయన దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేకపోయిందన్నారు. గతంలో ఆర్యన్‌కు నేరచరిత్ర లేదన్నారు రోహత్గీ.

విదేశాలకు పారిపోయే అవకాశముందని..

ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, విదేశాలకు పారిపోయే అవకాశముందని ఎన్సీబీ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. షారూఖ్‌ మేనేజర్‌ పూజా దడ్లాని సాక్ష్యులను తమ వైపు తిప్పుకుంటున్నారని ఎన్సీబీ అఫిడవిట్‌లో పేర్కొంది. డ్రగ్స్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్సీబీ.

ఎన్సీబీకి ముందే సమాచారం..

క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీపై ఎన్సీబీకి ముందే సమాచారముందన్నారు. కుట్రలో భాగంగానే అరెస్ట్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. మెడికల్‌ టెస్ట్‌లో ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. అసలు పార్టీ జరగలేదని , పార్టీకి ముందే అరెస్ట్‌ చేశారన్నారు. ఆర్యన్‌ ఫోన్‌లో లభ్యమైన డ్రగ్స్‌ చాట్స్‌ ఆయన విదేశాల్లో ఉన్న సమయం లోనివని , ఈ కేసుతో సంబంధం లేదని వాదించారు ముకుల్‌.

లోతైన విచారణ అవసరమని..

ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని , ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ రాకెట్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని కూడా అఫిడవిట్‌లో ఎన్సీబీ పేర్కొంది . అయితే ఎన్సీబీకి కౌంటర్‌గా హైకోర్టులో ఆర్యన్‌ కూడా అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఎన్సీబీలో జరుగుతున్న గొడవతో తనకు సంబంధం లేదని ఆర్యన్‌ తెలిపాడు . సాక్షులతో తనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవని తెలిపాడు.

First published:

Tags: Bombay high court, Drugs case, Mumbai

ఉత్తమ కథలు