Home /News /crime /

పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..

పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు. పెళ్లిని రద్దుచేసుకుంటున్నాం‘ అంటూ వరుడి తండ్రి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అసలు విషయం ఏంటా అని వధువు ఆ వరుడికి ఫోన్ చేసింది.

  పెళ్లి కూతురు నచ్చలేదన్న కారణంతో పెళ్లిని రద్దు చేసుకున్న యువకుల గురించి విని ఉంటారు. కట్నకానుకల వద్ద తేడా వచ్చి పెళ్లికి నో చెప్పిన అబ్బాయిలను కూడా చూసి ఉంటారు. ప్రేమ వ్యవహారం కారణంగా పెళ్లి చూపుల్లో చెప్పలేక ఆ తర్వాత విషయం చెప్పి పెళ్లిని కేన్సిల్ చేసుకున్న ఘటనలను గురించి విని ఉంటారు. కానీ ఓ యువకుడు మాత్రం అర్థం లేకుండా ప్రవర్తించాడు. విచిత్ర కారణం చెప్పి పెళ్లిని రద్దుచేసుకున్నాడు. దీంతో కారణమేంటని వధువు ఫోన్ చేస్తే ఊహించని కారణాలు చెప్పాడు. వధువు కుటుంబ సభ్యులు అతడి ఇంటికే వెళ్తే బయటకు గెంటేశారు. దీంతో ఈ విషయమై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ యువకుడు, అతడి తల్లిదండ్రులు చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్రలోని ముంబై నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ముంబైకు చెందిన నీరజ్ పాటిల్ అనే ఇంజనీర్ కు, వాడకు చెందిన డాక్టర్ గా చేస్తున్న యువతికి కొద్ది నెలల క్రితం పెళ్లి ఖరారయింది. ఇద్దరూ విద్యావంతులే కావడంతో పెళ్లి ఖరారయినప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. గంటల కొద్దీ మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకునేవాళ్లు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న వాళ్ల ఆచారం ప్రకారం ’తిలక్‘ వేడుక జరిగింది. ఈ వేడుకలోనే పెళ్లి ఎప్పుడు జరగాలన్నది ముహూర్తం పెట్టుకుంటారు. ఇరు కుటుంబాల నుంచి దాదాపు 40 మంది దగ్గరి బంధువులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ముభావంగా ఉన్న వరుడు, అతడి కుటుంబ సభ్యులు పెళ్లి రోజు గురించి మాట్లాడుకోకుండానే ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత మాట్లాడుకుందాం, ఫోన్ చేసి చెబుతామంటూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఇంటికి వెళ్లి రోజులు గడుస్తున్నా వారి నుంచి ఫోన్ కాల్ రాలేదు.
  ఇది కూడా చదవండి: రాత్రి పెళ్లి.. తెల్లారే అత్తారింటికి పంపిస్తోంటే కుప్పకూలిపోయిన వధువు.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పింది విని..

  ఆ తర్వాత తీరిగ్గా ‘ ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు. పెళ్లిని రద్దుచేసుకుంటున్నాం‘ అంటూ వరుడి తండ్రి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అసలు విషయం ఏంటా అని వధువు ఆ వరుడికి ఫోన్ చేసింది. ’నువ్వు, మీ అమ్మ, మీ బంధువులంతా మమ్మల్ని బాగా అవమానించారు. తిలక్ వేడుకలో మీరు చేసిన ఏర్పాట్లను చూసి మాకు ఏవగింపు కలిగింది. మేం పవిత్రంగా భావించే సింధూరాన్ని కూడా క్వాలిటీ లేకుండా తీసుకొచ్చారు. మా అమ్మానాన్నలను సరిగా గౌరవించలేదు. అందుకే ఈ పెళ్లిని కేన్సిల్ చేస్తున్నా‘ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏదో ఒకటి తేల్చుకునేందుకు వధువు తరపు వాళ్లు వరుడి ఇంటికి వెళ్లినా, వారికి చేదు అనుభవమే ఎదురయింది. దీంతో ఈ విషయమై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిపై 420 సెక్షన్, 417 సెక్షన్, 500 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారు. వారిని విచారించి వదిలేశారు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Couple affair, Crime news, Crime story, CYBER CRIME, Illegal affairs, Love marriage

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు