Home /News /crime /

MUMBAI GIRL GETS DEATH THREAT OVER SOCIAL MEDIA POST ON UDAIPUR KILLING PAH

ఉదయ్ పూర్ హత్య పై పోస్టులు.. చంపేస్తామంటూ యువతికి వాట్సాప్ కాల్స్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: యువతి ఉదయ్ పూర్ హత్య ఘటనపై తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దీంతో కొన్ని గుర్తుతెలియని నంబర్ల నుంచి యువతికి బెదిరింపుల కాల్స్ వస్తున్నాయి.

ఉదయ్ పూర్ టైలర్ (Udaipur tailor) హత్య కేసు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోన ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ కన్హయ్యలాల్ నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో ఇద్దరు ముస్లిం యువకులు అతని షాపుకు వెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత.. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారు.

అదే విధంగా జూన్ 21న మహారాష్ట్రలోని (Maharashtra)  అమరావతిలో రసాయన శాస్త్రవేత్త ఉమేష్ కోల్హే ఇదే కారణంతో హత్యకు గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒక యువతి టైలర్ కన్హయ్యలాల్ కు మద్దతుగా తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు కొంత మంది వాట్సాప్ కాల్ చేస్తు బెదిరింపులకు గురిచేస్తున్నారు.



పూర్తి వివరాలు.. దక్షిణ ముంబైలోని (mumbai)  గిర్‌గావ్‌ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, తన ఫేస్ బుక్ లో, టైలర్ కన్హయ్యలాల్ కు మద్దతుగా పోస్టులు పెట్టింది. దీంతో గుర్తుతెలియన నంబర్ల నుంచి ఆమెకు ఫోన్ కాల్స్ వచ్చాయి. కొందరు చంపేస్తామంటూ కూడా బెదిరించారు. దీంతో బాలిక భయపడిపోయి, తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.

వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ప్రవక్త మొహమ్మద్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ సస్పెండ్ చేసిన నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో (Social media)  సందేశాన్ని పోస్ట్ చేసినందుకు జూన్ 28న రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరంలోని తన దుకాణంలో కన్హయ్య లాల్ హత్యకు గురయ్యాడు.

ఇదిలా ఉండగా  నుపూర్ శర్మ (nupur sharma)  వ్యాఖ్యలను సోషల్ మీడియా (Social media) వేదికగా సపోర్ట్ చేసిన కారణంగా.. రియాజ్ అఖ్తీ, గోస్ మహ్మద్ అనే ముస్లింయువకులు.. టైలర్ ను అతి దుకాణంలో ప్రవేశించి అతిదారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో  (Uday pur)  శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. వెంటనే రంగంలోనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు దిగాయి.

24 గంటలు గడవక ముందే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అదుపులోనికి తీసుకుని జైలుకు తరలించారు. అయితే, రియాజ్ అఖ్తరీ, గోస్ మహ్మద్ లను విచారణలో భాగంగా జైపూర్ లోని కోర్టుకు తరలించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Burtally murder, Crime news, Mumbai

తదుపరి వార్తలు