హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇదేం పాడు బుద్ధి.. యువతికి మద్యం తాగించి.. దివ్యాంగుల సాముహిక అత్యాచారం..

ఇదేం పాడు బుద్ధి.. యువతికి మద్యం తాగించి.. దివ్యాంగుల సాముహిక అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai:  బాలికకు దగ్గరి బంధువు కావడంతో తరచుగా ఇంటికి వస్తుండేవారు. దీంతో బాలిక కూడా వారి ఇంటికి వెళ్తుండేది.

కొందరు కామాంధులు మహిళలను, అమ్మాయిలను వదలడం లేదు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు తీసుకొచ్చిన, దిశ, పోక్సో, నిర్భయ చట్టాలకు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ఆడవాళ్లపై జరుగుతున్న దాడులు, అత్యాచార ఘటనల్లో ఎక్కువగా.. దగ్గరి వారే చేస్తున్నట్లు అనేక సంఘటనలలు వెలుగుచూశాయి. తాజాగా, మరోక మహిళపై అత్యాచార ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో  (Mumbai) దారుణం జరిగింది. 19 ఏళ్ల బాలికపై నలుగురు దివ్యాంగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులలో ఒకరు మహిళ బంధువు అని పోలీసుల విచారణలో తెలిసింది. శివాజీ నగర్ ప్రాంతంలో ఉంటున్న వీరు.. ఏప్రిల్ నుంచి బాలికను, నిందితులు తమ ఇంటికి తీసుకెళ్లేవారు. అక్కడ అత్యాచారం చేస్తుండే వారు. ఈ క్రమంలో తాజాగా, యువతి ప్రెగ్నెంట్ కావడంతో ఘటన వెలుగులోనికి.

దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా.. ఇతర వైకల్యాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను టెస్ట్ చేయడానికి ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా కొందరు పవిత్రమైన వివాహ బంధానికి మాయని మచ్చ తీసుకొస్తున్నారు.

అక్రమ సంబంధాలు (Extra marital affairs) పెట్టుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తు తమ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తమ పరువును బజారుకు ఈడ్చుకుంటున్నారు. కొంత మంది పెళ్లైన తర్వాత.. కూడా ఎఫైర్ లు కొనసాగిస్తున్నారు. భార్యకు తెలియకుండా.. భర్త కొన్ని చోట్ల ఎఫైర్ లను నడిపిస్తుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు కూడా వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. కొందరు ఎఫైర్ లు (Affairs)  పెట్టుకుంటు తమ వారికి అడ్డంగా దొరికిపోయిన సంఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. దీంతో దాడులు, హత్యలు చేయడానికి కూడా వెనుకాడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులోని (Tamil nadu)  సేలం జిల్లాలో దారుణం జరిగింది. శక్తివేల్ (37), పుగళరసి (27) భార్య భర్తలు. వీరు వీరభద్రన్ కోట్టై గ్రామంలో కూలీపనులు చేస్తున జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పుగళరసికి.. ముత్తుకుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచుగా (Affair)  కలుసుకునే వారు. ఇది గమనించిన భర్త.. శక్తివేల్ పద్దతి మార్చుకొవాలని భార్యను పలుమార్లు హెచ్చరించారు.

దీంతో పలుమార్లు వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో పుగళరసి, తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. భర్త అడ్డుని (Illegal affair) తొలగించుకోవాలని పథకం పన్నింది. శక్తివేల్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతనికి అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టింది. మద్యం మత్తులో కింద పడిపోయి చనిపొయినట్లు నమ్మించాలను కుంది. కానీ పుగళరసి, పై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించారు. తమ దైన శైలీలో విచారించగా ప్రియుడితో బతకడం కోసం ఇలా చేశానని ఒప్పుకుంది. దీంతో పుగళరసి, ముత్తుకుమార్ లను అరెస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Gang rape, Mumbai

ఉత్తమ కథలు