హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mumbai Fire Accident: కరోనా ఆస్పత్రిలో మంటలు... 10కి చేరిన మ‌ృతుల సంఖ్య

Mumbai Fire Accident: కరోనా ఆస్పత్రిలో మంటలు... 10కి చేరిన మ‌ృతుల సంఖ్య

ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 76 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మంటల ధాటికి ఆస్పత్రిలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలతో ఊపిరాడక కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    ముంబై అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. క్షతగాత్రులకు పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ముంబైలోని భాండూప్ ప్రాంతంలో ఉన్న డ్రీమ్స్ మాల్‌లో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో మంటలు చెలరేగి.. క్రమంగా పై అంతస్తులకు విస్తరించాయి. ఆ మాల్ చివరి అంతస్తులో ఉన్న సన్‌రైజ్ ఆస్పత్రికి కూడా మంటలు అంటుకున్నాయి.

    ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 76 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మంటల ధాటికి ఆస్పత్రిలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలతో ఊపిరాడక కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణ భయంతో హాహా కారాలు చేశారు. ఈ క్రమంలోనే శ్వాస ఇబ్బందులతో స్పాట్‌లోనే ఇద్దరు చనిపోయారు. మిగిలిన వారిని హుటాహుటిన ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 23 ఫైరిజంన్లతో మంటలు అదుపు చేశారు. ఐతే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మాల్‌లో ఆస్పత్రి ఉండడమేంటని.. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ముంబై మేయర్ స్పష్టం చేశారు.

    First published:

    Tags: Fire Accident, Maharashtra, Mumbai

    ఉత్తమ కథలు