• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MUMBAI CRIME BRANCH ARRESTED FOUR PERSONS IN CONNECTION WITH THE ALLEGED MURDER OF A 23 YEAR OLD MAN SSR

Affair: ఈ 23 ఏళ్ల కుర్రాడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని 25 కేజీల ఉప్పుతో కథ ముగించేశారు..

హత్యకు గురైన రాజు చౌప్పల్ (ఫైల్ ఫొటో)

బీహార్‌లోని ఓ గ్రామానికి చెందిన రాజు చౌప్పల్ అనే 23 ఏళ్ల యువకుడు తన సొంతూరిలోనే ఉంటున్నాడు. ఆ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెతో అఫైర్ కొనసాగిస్తున్నాడు. ముంబైలోని ఒషివర ప్రాంతంలో రాజు తల్లిదండ్రులు ఉంటున్నారు.

  • Share this:
    ముంబై: వివాహేతర సంబంధం 23 ఏళ్ల యువకుడి నిండు ప్రాణం తీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడన్న కారణంగా ఓ యువకుడిని ఆ వివాహిత భర్త, అతని స్నేహితులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. చనిపోయిన యువకుడు, చంపేసిన నిందితుడు ఇద్దరిదీ బీహార్‌లోని ఓ గ్రామం కావడం గమనార్హం. దాదాపు నెల రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఓ గ్రామానికి చెందిన రాజు చౌప్పల్ అనే 23 ఏళ్ల యువకుడు తన సొంతూరిలోనే ఉంటున్నాడు. ఆ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెతో అఫైర్ కొనసాగిస్తున్నాడు. ముంబైలోని ఒషివర ప్రాంతంలో రాజు తల్లిదండ్రులు ఉంటున్నారు. మే 13న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేందుకు బీహార్ నుంచి చౌప్పల్ ట్రైన్‌ ఎక్కాడు. అర్ధరాత్రి ముంబైకి వచ్చిన చౌప్పల్ ఇంటికి వెళ్లలేదు. ఒక రోజు గడుస్తున్నా కొడుకు ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదంటూ ఒషివర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. రాజు చౌప్పల్ గ్రామానికి చెందిన సురేందర్ మండ(40), శంభు, రామ్‌కుమార్ అనే ముగ్గురు అన్నదమ్ములు ముంబైలోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పనిచేస్తున్నారు. కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి వాళ్లతో స్నేహంగా ఉండేవాడు. అయితే.. కొన్నిరోజులుగా సురేందర్ మండ తన భార్య ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిసి రగిలిపోతున్నాడు. సురేందర్ మండ భార్య సంబంధం కొనసాగిస్తున్న యువకుడు రాజు చౌప్పల్ కావడం గమనార్హం. రాజు చౌప్పల్, తన భార్య వివాహేతర సంబంధం గురించి ఊళ్లో పెద్దలకు తెలిసి చౌప్పల్‌ను ఆమెకు దూరంగా ఉండాల్సిందిగా మందలించినట్లు సురేందర్‌కు తెలిసింది. అయితే.. ఊరిలో ఉన్నవాళ్లంతా తన భార్య అఫైర్ గురించి మాట్లాడుకోవడాన్ని సహించలేకపోయిన సురేందర్ తన భార్యతో అఫైర్ పెట్టుకున్న చౌప్పల్‌ను హతమార్చాలనుకున్నాడు.

    అయితే.. నమ్మించి చంపాలని ప్లాన్ వేసిన సురేందర్.. చౌప్పల్ ముంబైకి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్నాడు. చౌప్పల్‌కు సురేందర్ ఫోన్ చేసి ట్రైన్ దిగగానే తాము పనిచేస్తున్న సైట్‌కు రావాలని, కలిసి కూడా చాలారోజులైందని.. పార్టీ చేసుకుందామని పిలిచాడు. తన భార్యతో అఫైర్ పెట్టుకుంది తానేనని ముంబైలో ఉన్న సురేందర్‌కు తెలియదనుకుని అర్ధరాత్రి ఒంటి గంటకు ట్రైన్ దిగగానే సురేందర్ పనిచేస్తున్న సైట్‌కు వెళ్లాడు. అయితే.. అప్పటికే అతనిని చంపడానికి ప్లాన్ చేయడంతో తన సోదరులు, స్నేహితుడు సిద్ధంగా ఉన్నారు. మాటలతో నమ్మించి కన్‌స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్‌లోకి చౌప్పల్‌ను సురేందర్ తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లగానే.. ఓ ఇనుప రాడ్ తీసుకుని చౌప్పల్ తలపై సురేందర్ కొట్టాడు. ఆ దెబ్బతో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న చౌప్పల్‌ను సురేందర్ సోదరులు కాళ్లుచేతులూ పట్టుకున్నారు. మరో వ్యక్తి కత్తితో గొంతు కోశాడు.

    ఇది కూడా చదవండి: Nellore: ఇంట్లో ఇంటర్ చదివే కొడుకు.. పనిమనిషితో నెల్లూరు ప్రొఫెసర్ రాసలీలలు.. ఆమెను భార్య పనిలో నుంచి తీసేసిందని...

    అతి కిరాతకంగా హతమార్చిన తర్వాత.. చౌప్పల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ప్లాన్ చేసినట్టుగా అదే బిల్డింగ్‌లోని ట్యాంక్ లోపల పడేశారు. ఉదయాన్నే సురేందర్ మండ బయటకు వెళ్లి 25 కేజీల ఉప్పు కొన్నాడు. ఆ ఉప్పును తీసుకొచ్చి చౌప్పల్ మృతదేహంపై పోశాడు. ఉప్పు చల్లడం వల్ల చౌప్పల్ మృతదేహం దుర్వాసన రాదని సురేందర్ అలా ప్లాన్ చేశాడు. అయితే.. చౌప్పల్ ముంబైకొచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే సురేందర్ సొంతూరికి వెళ్లిపోయాడు. దీంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది. సురేందర్‌ మండను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సురేందర్‌తో సహా మిగిలిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: