Home /News /crime /

MUMBAI CRIME 26 YEAR OLD GUY STABS HIS EX GIRLFRIEND ON BUSY ROAD IN MUMBAI AND SURRENDERS HIMSELF TO POLICE NK

యువతిని కత్తితో పొడిచిన మాజీ లవర్... ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

యువతిని కత్తితో పొడిచిన మాజీ లవర్... ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

యువతిని కత్తితో పొడిచిన మాజీ లవర్... ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

అసలేంటి సమస్య... ప్రేమించిన వాడు ఎందుకు కత్తితో పొడిచాడు? వాళ్ల ప్రేమ ఎందుకు బ్రేకప్ అయ్యింది? ఈ మొత్తం ఘటనపై పోలీసులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

    ఏంటో... ఈ రోజుల్లో కొంత మంది కూరగాయలు కోయాల్సిన కత్తులతో మనుషుల్ని పొడుస్తున్నారు. అలాంటి ఓ ఘటన ముంబైలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగింది. సాకి నక ఏరియాలో శనివారం అందరూ నోరెళ్లబెట్టి చూశారు. షాక్ అయ్యారు. ఈ కేసులో పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన... బాధితురాలి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే జరిగినట్లు తెలిసింది. ఘటన తర్వాత... ఆమె కత్తి గాట్లతో ఇంటికి వెళ్లి కుప్ప కూలింది. ఆమె తండ్రి, ఓ ఆటో డ్రైవర్ గబగబా స్పందించి... ఆమెను రాజావాడీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బిజీగా ఉన్న డాక్టర్లు... అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స చేసి... ఆమెను అర్జెంటుగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. కట్ చేస్తే... సియోన్ హాస్పిటల్‌లో బాధితురాలు... ఆదివారం ఆమెకు సర్జరీ చేశారు.

    నిందితుడు 26 ఏళ్ల అర్జున్ సింగ్... స్వయంగా వెళ్లి సాకి నాకా పోలీసులకు రక్తంతో ఉన్న తన చేతిని చూపించాడు. ఏమైంది అని పోలీసులు అడిగితే... విషయం చెప్పాడు. అరెస్టు చేశారు.

    "వాళ్లిద్దరూ నాలుగేళ్ల కిందట రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమె అతనితో కలిసి ఉంది కూడా" అని పోలీస్ ఆఫీసర్ తెలిపారు. "వాళ్లిద్దరూ కలిసి జీవించారు. సంవత్సరానికి పైగా అలా ఉన్నారు. ఐతే... అర్జున్ సింగ్... మద్యానికి అలవాటుపడ్డాడు. తర్వాత డ్రగ్స్ వాడటం మొదలుపెట్టాడు. సరైన ఉద్యోగం ఏదీ చెయ్యకుండా ఉద్యోగాలు మార్చుతూ వచ్చాడు. దాంతో ఆమెకు చిరాకొచ్చి అతన్ని వదిలేసి... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది" అని తెలిపారు.

    తాజాగా సింగ్... సాకి నాకా ఏరియాలో ఓ బేకరీ దగ్గర గాలికి మెత్తబడిపోయిన బిస్కెట్ తింటున్నాడు. ఆమె రోజూ అటుగా వెళ్తుందని అతనికి తెలుసు. సాయంత్రం 6.30కి ఆమె ఇంట్లోంచీ రాసాగింది. దాంతో సింగ్ బిస్కెట్ మరింత వేగంగా తినసాగాడు. ఆమె వేగంగా నడుస్తుంటే... బిస్కెట్ తినడం పూర్తి చేసి... చేతులు దులుపుకుంటూ... గబగబా వెళ్లి... ఆమె చెయ్యి పట్టుకొని... "నాతో రా" అన్నాడు. "చెయ్యి వదులు" అంది. గింజుకుంది. కట్ చేస్తే... కత్తి తీశాడు. "నాతో రాకపోతే... ఇంకెవరితోనూ నిన్ను ఉండనివ్వను" అని బెదిరించాడు. "ఏం చేస్తావ్... ఆ ఏం చేస్తావ్" అంటుండగానే... కత్తి ఆమె పొట్టలో కసక్కున దూరింది. రక్తం ప్రవాహంలా చిమ్మింది.

    ఇది కూడా చదవండి: వామ్మో... పగలు ఫుడ్ డెలివరీ... రాత్రిళ్లు చోరీలు... ఇద్దరు డెలివరీ బాయ్స్ నిర్వాకం

    బేకరీలో బిస్కెట్లు తింటున్న వాళ్లు, టీ తాగేవాళ్లు, సిగరెట్ స్మోక్ చేసేవాళ్లు, రోడ్డున పోయే వాళ్లు, వచ్చేవాళ్లు... అంతా ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఆమె రక్తాన్ని ఆపేందుకు ట్రై చేసుకుంటుంటే... అది చూసిన సింగ్... అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె వెనక్కి తిరిగి వేగంగా ఇంటికి పరుగెత్తింది. చూసేవాళ్లంతా... ఏం జరిగిందో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు సింగ్‌పై కేసు రాసి... దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Crime story, Mumbai crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు