బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Sharukh khan) తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan)కు కోర్టులో మరోసారి చుక్కెదురయింది. ఆర్యన్ పెట్టుకున్న పిటిషన్‌ను ముంబై మెట్రోపాలిటన్ న్యాయస్థానం (Mumbai metropolitan court) తోసిపుచ్చింది. బెయిల్ (bail) పిటిషన్ పెట్టుకున్న ఆర్యన్‌ఖాన్‌తో పాటు.. ఆర్బాజ్, దమేచలకు కూడా మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో.. ఆర్యన్ ఖాన్‌ను మరో 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇక గురువారంతో ఆర్యన్ సహా 8 మందికి ఎన్సీబీ కస్టడీ (NCB Custody) ముగియడంతో కోర్టు తిరిగి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణ (Rejection)తో జ్యుడీషియల్ కస్టడీ కింద ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ (Arthur) రోడ్డు జైలులో గడపనున్నారు.
కోర్టులో హాజరు..
క్రూయిజ్ షిప్ (cruise ship)లో డ్రగ్స్ పార్టీ కేసుపై ముంబై కోర్టులో శుక్రవారం వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌తో పాటు అరెస్టయిన 8 మందిని ఎన్సీబీ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాలని, అక్టోబర్ 11 వరకు ఆర్యన్ కస్టడీ (custody)ని పొడిగించాలని ఎన్సీబీ అధికారులు కోరారు. దీంతో బెయిల్‌ను నిరాకరిస్తూ ముంబై కోర్టు తీర్పును వెలువరించింది.
Mumbai: Esplanade Metropolitan Magistrate court sent Nigerian National Chinedu Igwe to NCB custody till 11 October, in the case related to the seizure of drugs following a raid at a party on a cruise ship off the Mumbai coast
— ANI (@ANI) October 8, 2021
ఏం జరిగింది..
గత శనివారం రాత్రి అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్ లైనర్ ముంబై (Mumbai) నుంచి గోవా (goa)కు బయలుదేరింది. రెండు వారాల కిందటే ఈ క్రూయిజ్ లైనర్ సర్వీసులు ప్రారంభమవగా.. శనివారం పార్టీ కోసం ఏకంగా క్రూయిజ్‌నే అద్దెకు తీసుకున్నారు. నమస్క్రే ఎక్స్‌పీరియెన్స్, ఫ్యాషన్ టీవీ సంయుక్తగా క్రూయిజ్ షిప్‌లో మూడు రోజుల పార్టీ (3 days party) ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు పార్టీ జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ఎన్సీబీ (NCB)దాడులు చేసింది. పార్టీలో పాల్గొన్న వారిలో అందరూ బడా బాబుల పిల్లలే ఉన్నారు. క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీకి దాదాపు 1,500 మంది వరకు హాజరైనట్టు సమాచారం. వారంతా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి డ్రగ్స్ (drugs) తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీ (rave party) గురించి ఎన్సీబీకి సమాచారం అందడంతో..NCB ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని టీమ్ క్రూయిజ్‌లో దాడులు చేసింది. అనంతరం కొకైన్, హషీష్, ఎండీఎంఏను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
క్రూజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ (Drugs) వినియోగం వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ (Aryan Khan) సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు (police) అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు మరో ఎనిమిది మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bombay high court, Drug case, Mumbai, Supreme Court