MUMBAI COUPLE ARRESTED FOR FALSE PROMISES ABOUT BODYGUARD OFFER AND MALE ESCORT SERVICE TO A CHENNAI BUSINESSMAN HSN
విదేశీ మహిళలే కస్టమర్లు.. రూ.16 లక్షలు చెల్లించి మేల్ ఎస్కార్ట్ గా రిజిస్టర్ చేసుకున్న యువకుడు.. ఏడాది తర్వాత మైండ్ బ్లాంక్..!
ప్రతీకాత్మక చిత్రం
‘విదేశాల నుంచి వచ్చే మహిళల శృంగార కోరికలను తీర్చగలిగే మగాళ్లకు సదవకాశం.‘ అంటూ ఆ ప్రకటన కనిపించింది. అంతే, అతడు అస్సలు ఆలస్యం చేయలేదు. ఆ ప్రకటనలో కనిపించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేశాడు.
ఓ వ్యాపారవేత్త. సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తుండగా ఓ ప్రకటన కనిపించింది. అది మేల్ ఎస్కార్ట్ కు సంబంధించిన ప్రకటన. అదేదో ఆసక్తికరంగా ఉండటంతో దాన్ని క్లిక్ చేశాడు. ’విదేశాల నుంచి వచ్చే మహిళల శృంగార కోరికలను తీర్చగలిగే మగాళ్లకు సదవకాశం.‘ అంటూ ఆ ప్రకటన కనిపించింది. అంతే, అతడు అస్సలు ఆలస్యం చేయలేదు. ఆ ప్రకటనలో కనిపించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేశాడు. తనను తాను మేల్ ఎస్కార్ట్ గా రిజిస్టర్ చేసుకున్నాడు. వాళ్లు చెప్పినట్టే దాదాపు 16 లక్షల రూపాయలను ముందస్తు ఫీజుగా కూడా చెల్లించాడు. ఎప్పుడెప్పుడు తనకు ఫోన్ వస్తుందా? తన కొత్త జాబ్ ను ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అన్న ఆతృతతో ఎదురుచూశాడు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన దిప్నాకర్ దాస్ నావిస్, యాస్మిన్ ఖాన్ రసూల్ బేగం భార్యాభర్తలు. మోసాలు చేయడమే వీళ్ల పని. విదేశాల నుంచి వచ్చే మహిళల శృంగార కోరికలను తీర్చేందుకు మేల్ ఎస్కార్ట్ లు కావలెను అంటూ, ఓ ఎస్కార్ట్ సర్వీసును అందించే వెబ్ సైట్లో ప్రకటన ఇచ్చారు. దాన్ని చెన్నైలోని అన్నా నగర్ కు చెందిన మనీష్ గుప్తా అనే యువ వ్యాపారి చూశాడు. ఆ ప్రకటనను చూసి ఆకర్షితుడు అయ్యి వెంటనే దాంట్లో కనిపించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేశాడు. దిప్నాకర్, రసూల్ బేగం తమను తాము ఆ కంపెనీ మేనేజర్లుగా చెప్పుకుని అతడితో మాట్లాడారు. అతడి ఫొటోలను ఆన్ లైన్ లో తెప్పించుకున్నారు. మేల్ ఎస్కార్ట్ గా అవకాశం ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ ప్రముఖ నటికి బాడీగార్డ్ గా కూడా అవకాశం కల్పిస్తామని అతడితో నమ్మబలికారు.
వాళ్ల మాటలు నమ్మిన మనీష్, వారు అడిగిన వివరాలను సమర్పించాడు. అంతేకాకుండా 16 లక్షల రూపాయలను కూడా వారికి పంపించాడు. ఈ ఘటన 2019వ సంవత్సరంలో జరిగింది. అయితే తనను తాను మేల్ ఎస్కార్ట్ గా రిజిస్టర్ చేసుకున్నా, తనకు ఎంత కాలం అయినా అవకాశం రాకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. అప్పుడప్పుడు వాళ్లకు ఫోన్లు చేసి మాట్లాడేవాడు. ఓపిగ్గా ఉండాలనీ, మీ ఫొటో చూసి నచ్చిన వాళ్లు ఫోన్ చేస్తారని చెప్పుకొచ్చేవారు. చివరకు వారి చేతిలో మోసపోయానని గ్రహించిన మనీష్, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ భార్యాభర్తలిద్దరినీక ఈ శనివారం అరెస్ట్ చేశారు. కాగా, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.