ఆమె కోసం బాత్‌రూంలో మొబైల్ కెమెరా పెట్టాడు... ఆ తర్వాత...

అప్పుడెప్పుడో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... ఓ షాపింగ్ మాల్ డ్రెస్సింగ్ రూంలో... సీక్రెట్ కెమెరాను కనిపెట్టారు. ఇప్పటికీ చాలా చోట్ల అలాంటి కెమెరాలు పెడుతున్నారు కేటుగాళ్లు. మరి ముంబైలో ఏం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 7:20 AM IST
ఆమె కోసం బాత్‌రూంలో మొబైల్ కెమెరా పెట్టాడు... ఆ తర్వాత...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 7:20 AM IST
ముంబైలోని ఓ రద్దీ ఏరియాలో నివసిస్తున్నాడు 30 ఏళ్ల సద్దాం షేక్. చేసే పని క్యాబ్ డ్రైవర్. బుద్ధిగా పనిచేసుకుంటూ... తన జీవితం తాను జీవిస్తూ ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ... అతని బుద్ధి వంకరపోయింది. ఈ మధ్య పడిన భారీ వానలకు... అతను ఉంటున్న ఇల్లు బాగా నానిపోయి... పక్క పోర్షన్‌ బాత్‌రూం పైకప్పు గోడ పగిలింది. ఆ పోర్షన్‌లో ఓ ఫ్యామిలీ నివసిస్తున్నారు. వాళ్లకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ ఫ్యామిలీ... ఎవరి జోలికీ వెళ్లకుండా... సైలెంట్‌గా జీవిస్తున్నారు. అలాంటిది... ఆ ఇంటి యువతిపై కన్నేశాడు సద్దాం షేక్. పగిలిన బాత్ రూం గోడను రోజూ కొద్దికొద్దిగా చీల్చేందుకు ప్రయత్నించాడు. అతను ఎంత ప్రయత్నించినా ఆ పగులు మరింత పెద్దది కాలేదు. సన్నటి పగులు మాత్రమే ఉంది.

తన ప్లాన్ వర్కవుట్ కావట్లేదనుకున్న సద్దాం షేక్... తన దగ్గర లావుగా ఉన్న మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్‌ కింద ఇచ్చేసి... అత్యంత సన్నగా ఉన్న మరో స్మార్ట్‌ఫోన్ కొనుక్కున్నాడు. ప్లాన్ ప్రకారం దాని కెమెరాను ఆన్ చేసి... సన్నటి గోడ పగులు నుంచీ బాత్ రూంలోకి వెళ్లేలా చేశాడు. ఆ టైంలో ఆ ఇంట్లోని యువతి స్నానం చేసేందుకు వస్తుందని అతనికి తెలుసు. సరిగ్గా ఆమె వచ్చే ముందే కెమెరాను సెట్ చేశాడు. ఇవేవీ తెలియని ఆమె... రోజూ లాగే స్నానం చేసేందుకు వచ్చింది.

ఆమె సగం స్నానం చేసిన తర్వాత... అనుకోకుండా పైకి చూసింది. అక్కడ ఏదో వస్తువున్నట్లు కనిపించింది. అదేంటా అని జాగ్రత్తగా చూసింది. అది మొబైల్‌లా కనిపించేసరికి షాకైంది. వెంటనే దాన్ని లాగింది. దాంతో... సన్నగా ఉన్న కొత్త మొబైల్ ఆమె చేతికొచ్చింది. ఆమె లాగుతున్న టైంలో కెమెరా రికార్డ్ ఆగిపోయి... మొబైల్ లాక్ అయ్యింది. గబగబా స్నానం పూర్తి చేసిన ఆమె... మొబైల్‌ని తీసుకెళ్లి తన భర్తకు చూపించింది. అతను ఎంత ప్రయత్నించినా... దాని లాక్ ఓపెన్ కాలేదు.

మొబైల్ తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చాడు. వాళ్లు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెక్నికల్ ఎనలిస్ట్‌తో దాన్ని ఓపెన్ చేశారు. హెచ్‌డీ క్వాలిటీలో బాత్ రూం వీడియో రికార్డ్ చేసినట్లు తెలిసింది. వెంటనే దాన్ని డిలీట్ చేసి, మొబైల్‌ను సీచ్ చేసి, కేసు నమోదు చేసి... సద్దాం షేక్‌ను అరెస్టు చేశారు. బాత్ రూం గోడ పగులును సిమెంట్‌తో మూసేసే వరకూ... అందులో స్నానం చెయ్యవద్దని ఆ ఫ్యామిలీకి సూచించారు పోలీసులు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...