హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యమంటే... ఏకంగా చంపేశారు...

Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసే డాక్టర్లు నిపుణులై ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 8:55 AM IST
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యమంటే... ఏకంగా చంపేశారు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జుట్టు రాలిపోవడం, బట్టతల సమస్య ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తోంది. అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిస్తుంది. పైగా చుట్టూ ఉన్నవాళ్లు... జుట్టు రాలిపోతోంది అని అంటుంటే... అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్ల కొంతమంది ఎలాగొలా జుట్టు వస్తే బాగుండని రకరకాల క్రీములు, తైలాలూ ట్రై చేస్తుంటారు. అవి సక్సెస్ కాకపోతే... చివరకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటూ ఉంటారు. ముంబైలో ఓ వ్యాపారి అలాగే ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. అది వికటించి ఏకంగా ఆయన ప్రాణాలే పోవడంతో... ఇప్పుడు దేశవ్యాప్తంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై చర్చ జరుగుతోంది. ఇలాంటివి చేయించుకోవచ్చా అన్నదానిపై అనుమానాలు కలుగుతున్నాయి.

ముంబైలోని సాకినాక ప్రాంతానికి చెందిన వ్యాపారి శ్రావణ్ కుమార్ చౌదరికి 43 ఏళ్లు. జన్యు పరమైన సమస్యల వల్ల ఆయనకు 30 ఏళ్ల నుంచే జుట్టు రాలిపోతూ వచ్చింది. రాన్రానూ అది ఎక్కువవడం, తలపైభాగంలో జుట్టు పూర్తిగా ఊడిపోవడంతో... హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని అనుకున్నారు. సిటీలోని ఓ సాదా సీదా క్లినిక్‌కు వెళ్లి... తలపై 9,500 హెయిర్స్‌ను ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. అప్పుడంతా బాగానే ఉంది. ఓ రెండు వారాల్లో కొత్త జుట్టు వస్తుందనీ... అప్పటివరకూ ఈ మందులు వాడండి అని కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు డాక్టర్లు.

ఇంటికి వెళ్లిన శ్రావణ్... పనులు పూర్తి చేసుకొని పడుకున్నాడు. తీరా లేచాక... తలపై ఒకటే దురద. డాక్టర్లేమో... ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన ప్రదేశాన్ని టచ్ చెయ్యవద్దని చెప్పారు. అతనికేమో దురద పెరిగిపోసాగింది. కాసేపటికి శ్వాస తీసుకోలేని పరిస్థితి వచ్చింది. ఊపిరి ఆడట్లేదు. గొంతు ఉబ్బిపోయింది. వెంటనే సిటీలోని పొవాయ్ హీరానందిని ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే ఆయన తలపై బొబ్బలు వచ్చేశాయి. ముఖం ఉబ్బినట్లు అయిపోయింది. వాచిపోయింది. డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేసేలోపే ఆయన చనిపోయారు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు ఓ రకమైన క్రీమ్‌ను రాస్తుంటారు డాక్టర్లు. ఆ క్రీమ్ అందరికీ సెట్ కాదు. శ్రావణ్‌కి అది సెట్ కాకపోవడం వల్ల అలర్జీ వచ్చేసిందని తెలుస్తోంది. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు... ఎంక్వైరీ మొదలుపెట్టారు.

 

ఇవి కూడా చదవండి :

CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...టీడీపీ - వైసీపీ ... ఏ పార్టీ పథకాలు గొప్పవి ... విజయం ఎవరిది?

UPSSSC చక్బందీ లెక్పాల్ రిక్రూట్‌మెంట్ : 1,364 జాబ్స్... ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్స్... ఇలా అప్లై చేసుకోండి

RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
First published: March 11, 2019, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading