Mumbai Bizarre Crime : ముంబై అన్నది పేరుకే మహా నగరం. లోపల చూస్తే... ఎన్నో ఆర్థిక నేరాలు, అత్యాచారాలు, ఘోరాలు. ముంబైలో జరిగిన ఓ అత్యాచార ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏమైదంటే... ఓ మైనర్ యువతికి ఆమె తల్లి... ఏదో ఊరు వెళ్తున్నానని చెప్పి బయల్దేరింది. మళ్లీ సాయంత్రం వస్తానని చెప్పింది. "ఇల్లు జాగ్రత్త.. మొక్కలకు నీళ్లు పొయ్యడం మర్చిపోకు... బయటకు వెళ్తే ముఖానికి కర్చీఫ్ కట్టుకొని వెళ్లు... అసలే కరోనా వైరస్ సోకుతోంది" అంటూ అన్ని జాగ్రత్తలూ చెప్పి వెళ్లింది. తల్లి వెళ్లిన పావు గంట తర్వాత... ఆ మైనర్ యువతి... తన 20 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌కి కాల్ చేసింది. "ఏం చేస్తున్నావ్... అంటూ మాటలు మొదలుపెట్టింది" వాడో ఆవారా. "చేసేదేముంది... ఖాళీ" అన్నాడు. మాటల్లో ఇంట్లో అమ్మ ఊరెళ్లింది... సాయంత్రం వస్తానంది అని చెప్పింది. అంతే... అవునా... నేను రానా అని అడిగాడు. "ఎందుకు" అని అడిగింది. "రావొద్దా" అని అన్నాడు. "అంటే" అని ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. "వస్తాలే" అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేసింది.
కాసేపటికే వచ్చేశాడు. కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత... మీ ఇల్లు చూపించవా అన్నాడు. ఇదేమన్నా ఇంద్రభవనమా అంతా తిప్పి చూపించడానికి అంది. నా దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి... ఇది స్వర్గమే అన్నాడు. నవ్వేసింది. ఆ తర్వాత... ఇది కిచెన్ అది బాత్రూం... అంటూ చూపించి... పై అంతస్థుకు తీసుకెళ్లింది. అక్కడ మూడు గదులుండగా... వాటిలో ఒకటి ఆమె బెడ్రూం. ఆ గదులను చూపించి... ఇది నా బెడ్రూం అని పరిచయం చేసింది. వావ్... అదిరిపోయింది... నీలాగే అన్నాడు. నవ్వేసింది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది అన్నాడు. "ఉండు" అంది. "నీతో" అన్నాడు చిన్నగా నవ్వింది.
ఇలా ఆ మైనర్ యువతిని మాటల్లో పెట్టి... అత్యాచారం చేశాడు. ఆ తర్వాత... ఇంటి ముందు ఆటో సౌండ్ వచ్చింది. ఏంటా అని బాలిక కిటికీ లోంచీ చూసింది. ఆమె తల్లి... ఆటో డ్రైవర్‌కి డబ్బులిస్తూ కనిపించింది. "అమ్మో అమ్మ" అంది. "ఊరెళ్లిందన్నావుగా" అన్నాడు. "వచ్చేసింది... నువ్వు వెళ్లిపో" అంది. ఎలా వెళ్లాలో అతనికి అర్థం కాలేదు. అప్పటికే ఆమె ఇంట్లోకి వచ్చేసింది. కూతుర్ని పిలుస్తోంది. అతను చూస్తే... నేను వెళ్లను... నోతోనే ఉంటా అన్నాడు. ఆమె కేమో... "అమ్మొచ్చేస్తోంది. పైకొచ్చేస్తోంది... బాబోయ్... అయిపోయింది నా పని"... అనుకుంటూ... ఆమె కిటికీ లోంచీ కిందకు దూకేసింది. దాంతో... కాలు విరిగిపోయింది.
పైకి వచ్చిన తల్లి... కూతురిని పిలుస్తుంటే... బెడ్రూం తలుపు తీసి... ఆమె కిందకు దూకేసిందని చెప్పాడు. "ఆ... దూకేసిందా... అసలు నువ్వెవరు... ఇక్కడేం చేస్తున్నావ్" అంటూ ఆమె ఫైర్ అయ్యింది. అంతలోనే కూతురు కిందకు దూకేసిందని క్లారిటీ వచ్చి... బాగా టెన్షన్ పడింది. ఆ తర్వాత... కూతుర్ని ఇద్దరూ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్ తెలిపారు. పోలీసులు ఎంటరయ్యారు. యువకుణ్ని అరెస్టు చేశారు. అతనిపై మైనర్ యువతిపై అత్యాచారం జరిపినట్లుగా పోక్సో చట్టం కింద కేసు రాశారు. అంతే కాదు... యువతి కిటికీలోంచీ కిందకు దూకేయడానికి కూడా అతనే కారణమని మరో సెక్షన్ కింద కూడా కేసు రాశారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.