SIM Swap : రెండు ఈమెయిల్స్ పంపి... రూ.49 లక్షలు కాజేశారు... ఇదెలా సాధ్యమైంది?

SIM Swap : సైబర్ క్రైమ్‌లో కొత్త దారులు వెతుకుతున్నారు హ్యాకర్లు. జస్ట్ వన్డేలో లక్షలు కొట్టేస్తున్నారు. వాళ్ల ప్లాన్స్ ఏంటో మనమూ తెలుసుకోవాలి. తద్వారా ఆ ఉచ్చులో మనం చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి.

Krishna Kumar N | news18-telugu
Updated: February 4, 2019, 10:15 AM IST
SIM Swap : రెండు ఈమెయిల్స్ పంపి... రూ.49 లక్షలు కాజేశారు... ఇదెలా సాధ్యమైంది?
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: February 4, 2019, 10:15 AM IST
అది ముంబైలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ. దాని ఓనర్ ప్రశాంత్ తన మొబైల్‌కీ, కంపెనీ కరెంట్ బ్యాంక్ అకౌంట్‌కీ లింక్ పెట్టారు. అందువల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఆయన తన మొబైల్ నుంచే నిర్వహిస్తున్నారు. ఐతే... ఈమధ్య ఆయన మొబైల్‌కి... టెలికం కంపెనీ నుంచీ రెండు ఈమెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ సిమ్ డీ-యాక్టివేట్ అయ్యింది. ఆయన దాన్ని డీ-యాక్టివేట్ చెయ్యలేదు. దానంతట అదే అలా అయ్యింది. ఎందుకో ఆయనకు అర్థం కాలేదు. కట్ చేస్తే... ఆయన బ్యాంక్ అకౌంట్‌లోని రూ.49 లక్షలు మాయమయ్యాయి. ఇలా ఎలా జరిగిందో అర్థం కాని ఆయన... సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. విషయం వాళ్లకు చెప్పారు. అంతా తెలుసుకున్న పోలీసులు... దీన్నే "సిమ్ స్వాప్" అంటారని తెలిపారు.

సిమ్ స్వాప్ అంటే ఏంటి : కంపెనీ ఓనర్ ప్రశాంత్ వాడుతున్న సిమ్‌ను స్వాప్ చేసిన హ్యాకర్... దాని ద్వారా... కంపెనీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఐడీ, పాస్‌వర్డ్ అన్నీ తెలుసుకున్నాడు. రెండ్రోజుల్లో 11 సార్లు ట్రాన్సాక్షన్లు జరిపి రూ.49 లక్షలు కొట్టేశాడు.


ఇదెలా చేస్తారంటే... మొబైల్ ద్వారా బ్యాకింగ్ కార్యకలాపాలు చేస్తే... దాన్లోని సిమ్‌లో బ్యాంకుకి సంబంధించిన వివరాలు సేవ్ అవుతాయి. ఆ వివరాల్ని కనిపెట్టే హ్యాకర్లు... ఆ తర్వాత ఆ సిమ్‌కి సంబంధించి మొబైల్‌ కంపెనీ ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసి దాని ద్వారా ఈమెయిల్స్ పంపిస్తారు. మొదటి దాంట్లో "మీ సిమ్ సక్సెస్‌ఫుల్‌గా మార్చాం" అని ఉంటుంది. రెండో దాంట్లో... "మీ పాత సిమ్ డీయాక్టివేట్ అవుతుంది" అని ఉంటుంది. వెంటనే సిమ్ పనిచెయ్యడం మానేస్తుంది.




ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్‌ని మార్చేస్తారు హ్యాకర్లు. పాస్‌వర్డ్ రీసెట్ చెయ్యమని బ్యాంక్ అధికారులను అడిగితే... వాళ్లు కనీసం 24 గంటలు సమయం పడుతుందని చెబుతారు. ఈ 24 గంటల్లోనే ఆ అకౌంట్ నుంచీ వీలైనంత మనీ డ్రా చేస్తారు హ్యాకర్లు. ఈ కేసులో ప్రశాంత్ బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ రీ-సెట్ చెయ్యడానికి 48 గంటలు పట్టింది. ఆలోగా రూ.49 లక్షలు దోచేశారు హ్యాకర్లు.

ఈ మొత్తం కేసులో మనం తెలుసుకోవాల్సింది ఒకటే. మొబైల్‌లో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకూడదు. మనకు తెలియని మెయిల్స్‌ని ఓపెన్ చెయ్యకూడదు. మనకు సంబంధం లేని లింక్స్ క్లిక్ చెయ్యకూడదు. అలాంటివి చేస్తే... హ్యాకర్లు మన సమాచారం కొట్టేసి... షాక్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది.
Loading....
 

Photos: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోస్
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు