Father Molested his minor daughter: ముంబైలో దారుణమైన ఉదంతం జరిగింది. కన్నతండ్రి కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె ఇంట్లో ఉండగా.. బెదిరింపులకు గురిచేస్తు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక, శారీరక మార్పులు గ్రహించిన ఆమె బామ్మ బాలికను నిలదీయడంతో దారుణం వెలుగులోనికి వచ్చింది. ఈ దారుణం.. గతేడాది జరిగింది. తాజాగా,కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన భార్య పిల్లలు, తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో.. అతని వేధింపులు తాళలేక భార్య ఇల్లు విడిచిపెట్టి పోయింది. అయితే, నిందితుడి తల్లి.. తన పెన్షన్ తో మనవరాలిని, మనవలను చూసుకునేది. కొడుకు ప్రతి రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో... కొన్నిరోజులకు.. తన మనవరాలి ప్రవర్తనలో మార్పులు గమనించింది.
దీంతో ఆమెను విచారించింది. ఆ తర్వాత.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. బాలికను పరీకించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని తెలిపారు. మైనర్ బాలిక ప్రస్తుతం 7 వ తరగతి చదువుకుంటుంది. బాలికను నిలదీస్తే.. భయంతో తన తండ్రి ప్రతి రోజు అఘాయిత్యానికి పాల్పడేవాడని తెలిపింది. దీంతో ఆమె.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ బాలిక మాత్రం పోలీసులకు తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పలేదు.
నిందితుడు... బెదిరింపులకు గురిచేశాడో.. తండ్రిని ఏం చేస్తారో అని భయపడింది. ఈ కేసు విచారించిన కోర్టు.. కన్న తల్లి కొడుకు పట్ల అబద్దం చెప్పదు. కొడుకు లేకపోతే... కుటుంబం బాధ్యతలు ఆమె తీసుకొవాలి. కానీ ఇక్కడ.. బాలిక ఒకే గదిలో ఉంటారు. నిందితుడు కొన్ని రోజుల నుంచి అఘాయిత్యం చేస్తున్న కూతురు ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఉండటాన్ని కోర్టు తీవ్రంగా భావించింది.
బాలికను స్కూల్ లో ఎవరైన అత్యాచారం చేశారా అని ఆరా తీశారు. కానీ ఆమెకు ఎవరు మిత్రులు లేరని తెలింది. దీంతో కన్నతండ్రే.. బాలిక పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేల్చింది. నిందితుడికి తాజాగా, కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగారా శిక్షను విధించింది. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.