Home /News /crime /

MUMBAI 50 YEAR OLD MAN MOLESTED 16 YEAR OLD GIRL ARRESTED AFTER FAMILY FINDS ABOUT DAUGHTERS PREGNANCY PAH

ఇదేం ఘోరం.. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారని హెల్ప్ చేయడానికి వెళ్తే.. బాలికను గదిలో బంధించి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: బాలిక ఇంటి పక్కన 50 ఏళ్ల వృద్ధుడు ఉంటున్నాడు. అతనికి ఎవరు లేరు. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలిక అతనికి ఏదైన కావాలిస్తే తెచ్చిపెట్టేది.

కామాంధులు పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవ్వరిని వదలడం లేదు. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. చాక్లెట్ ఇస్తామని చెప్పి, పనుందని చెప్పి.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు మరీ నీచంగా కుక్కలు, ఆవులు, మేకల వంటి పశువులపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు వార్తలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల తెలిసిన వారు కూడా, మాయమాటలు చెప్పి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. 50 ఏళ్ల వృద్ధుడు కొత్త ఇంటికి మారుతున్నాడు. అయితే, బాలిక.. అతనికి సామానులు ప్యాక్ చేయడంలో సహాయం చేసింది. ఈ క్రమంలో.. అతను ఆమెను గదిలోనికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం (rape on girl)  చేశాడు. మే 24, 25 తేదిలలో ఈ ఘటన జరిగింది. ఘటన గురించి ఎవరికైన చెబితే చంపుతానని అతను బెదిరించాడు.



కొన్ని రోజుల పాటు బాలిక షాకింగ్ లో ఉండిపోయింది. ఆ తర్వాత.. బాలిక ఆరోగ్యంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆమెను టెస్ట్ చేయగా ప్రెగ్నెంట్ అని తెలింది. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా  జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది.

డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. దీనికి జార్ఖండ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, కొంత మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు, మరికొంత మంది అతిథులు హజరయ్యారు. అందరు పార్టీలో హుషారుగా పాల్గోన్నారు. మద్యం తాగారు. అయితే, కలెక్టర్, విద్యార్థి సింగిల్ గా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను లైంగికంగా (harassment)  వేధించాడు.

అయితే, యువతి ఇంటికి వెళ్లి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో సోమవారం.. తనపై  కలెక్టర్ లైంగిక వేధింపులకు (female harassment) పాల్పడ్డాడని ఖుంటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పార్టీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పార్టీకి వచ్చిన ఇతరులకు కూడా విచారించారు. ప్రాథమికంగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమేనని వారు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు