ముంబైలో దారుణం... ఆస్పత్రి నుంచి పారిపోయిన యువతిపై గ్యాంగ్ రేప్...

ఆమె జీవితం కష్టాల మయం. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అలాంటిది ఆస్పత్రి నుంచి ఎందుకు పారిపోయింది? గ్యాంగ్ రేప్ చేసిందెవరు?

news18-telugu
Updated: July 14, 2020, 12:34 PM IST
ముంబైలో దారుణం... ఆస్పత్రి నుంచి పారిపోయిన యువతిపై గ్యాంగ్ రేప్...
ముంబైలో దారుణం... ఆస్పత్రి నుంచి పారిపోయిన యువతిపై గ్యాంగ్ రేప్... (credit - twitter)
  • Share this:
ఆ యువతి వయస్సు 17 సంవత్సరాలు. గతేడాది... బెంగళూరులో తన ఇంటి నుంచి పారిపోయి... ముంబై వచ్చింది. కుర్లాలో ఓ హాస్టల్‌లో ఉంటూ... ఓ హోటల్‌లో పనిచేస్తోంది. అక్కడ 18 ఏళ్ల ఓ కుర్రాడు పరిచయమయ్యాడు. ఫ్రెండ్ అయ్యాడు. అతన్ని బాగా నమ్మింది. "నువ్వు విడిగా హాస్టల్‌లో ఉండటమెందుకు... నాతో పాటూ... నా రూంలో ఉండొచ్చుగా... ఖర్చులు కలిసొస్తాయి" అన్నాడు. సరే అంది. సామాన్లన్నీ తెచ్చుకొని... అతని రూంలో దిగింది. అలా ఇద్దరూ కలిసి జీవించసాగారు. ఇంతలో మరిన్ని అనూహ్య మలుపులు. ఏం జరిగిందో తెలియదు. జూన్ 26న ఆ కుర్రాడు... ధారావిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి దూకి... ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె షాకైంది. అతని కుటుంబ సభ్యులు... ఆమెను తప్పుపట్టారు. పోలీసులు ఆమెను రకరకాలుగా ప్రశ్నించారు. చివరకు ఆ సూసైడ్‌తో ఆమెకు సంబంధం లేదని తేల్చి... ఆమెపై ఏ కేసూ రాయలేదు.

పోలీసులు ఆమెకు 18 ఏళ్లు నిండలేదన్న ఉద్దేశంతో... ఆమెను చిల్డన్స్ హోమ్‌కి తరలించారు. అక్కడి అధికారులు ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ ఆమెను తిరిగి బెంగళూరులోని ఇంటికి పంపేయమని ఆదేశించింది. కానీ లాక్‌డౌన్ అమల్లో ఉందన్న ఉద్దేశంతో పోలీసులు ఆమెను బెంగళూరు పంపలేదు. ఇంతలో... ఆ చిల్డ్రన్స్ హోమ్‌లో వాతావరణం నచ్చక... ఆ యువతికి అనారోగ్యం వచ్చింది. దాంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. జులై 11న హాస్పిటల్ నుంచి పారిపోయింది.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూశారూ. ఆమె కొంత మంది టాక్సీ డ్రైవర్లతో మాట్లాడినట్లు కనిపించింది. వాళ్లను కలిసి వివరాలు అడిగితే... ఆ యువతి... తనను పుణె తీసుకెళ్లమందని చెప్పారు. పుణె నుంచి బెంగళూరుకు బస్సులో వెళ్లాలన్నది ఆమె ప్లాన్.

టాక్సీ డ్రైవర్లలో ఒకడు ఆమెను కారు ఎక్కించుకున్నాడు. దారిలో మరొకడు ఎక్కాడు. అతనెవరు అంటే... నా ఫ్రెండ్ అని డ్రైవర్ చెప్పాడు. వాళ్లిద్దరూ ఆమెను పుణె కాకుండా... ముంబ్రా తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఓ గదిలో బంధించి... ఇద్దరూ రేప్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా... కారు వెళ్లిన రూట్ తెలుసుకున్న పోలీసులు... ముంబ్రాలో కారును గుర్తించారు. దాని డ్రైవర్‌ను పట్టుకొని ఉతికారేశారు. దాంతో... వాడు నిజం చెప్పాడు. అలా యువతిని ఆ గది నుంచి రక్షించిన పోలీసులు... ఆస్పత్రికి పంపారు. ఇలా ఇంట్లోంచీ పారిపోయిన ఆమెకు అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. ఇప్పుడు ఆస్పత్రిలో కోలుకుంటోంది. మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యింది. త్వరలోనే నార్మల్ పొజిషన్‌కి వచ్చి... న్యూలైఫ్ స్టార్ట్ చేస్తుందని కోరుకుందాం.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading