ఊహించని విషాదం : ఆ తల్లిదండ్రులు చేసిన పనికి కూతురు బలైపోయింది..

అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడం.. ఫ్లాట్‌కు బయటి నుంచి తాళం వేయడంతో.. బయటపడే మార్గం లేక ఆ టీనేజర్ మంటల్లో సజీవ దహనమైంది.

news18-telugu
Updated: May 14, 2019, 4:34 PM IST
ఊహించని విషాదం : ఆ తల్లిదండ్రులు చేసిన పనికి కూతురు బలైపోయింది..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 14, 2019, 4:34 PM IST
శుభకార్యానికి వెళ్తూ ఆ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేశారు. అయితే కూతురు మాత్రం ఇంట్లోనే ఉంది. తాము లేని సమయంలో బయట ఎక్కడా తిరగకుండా.. బుద్దిగా ఇంట్లోనే ఉండి చదువుకోవాలన్న ఉద్దేశంతో తాళం వేసి వెళ్లిపోయారు. కానీ ఊహించని ఘటనతో ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడం.. ఫ్లాట్‌కు బయటి నుంచి తాళం వేయడంతో.. బయటపడే మార్గం లేక ఆ టీనేజర్ మంటల్లో సజీవ దహనమైంది. ముంబైలోని దాదర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని దాదర్‌లో ఉన్న అపార్ట్‌మెంటులో శ్రావణి చవాన్(16) కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం బంధువుల పెళ్లి ఉండటంతో.. కుటుంబ సభ్యులంతా బయలుదేరారు. అయితే శ్రావణిని మాత్రం ఇంట్లోనే ఉంచి.. బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. శ్రావణి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే చదువుకోవాలన్న ఉద్దేశంతో అలా చేశారు.

అయితే మధ్యాహ్నం 1.45గం. సమయంలో అపార్ట్‌మెంటులోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పై అంతస్తులోకి వ్యాపించడంతో శ్రావణి చవాన్ మంటల్లో దహనమైంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె తప్పించుకుందామనుకున్నా వీలు లేకుండా పోయింది. ఎయిర్ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్టు పోలీసులు చెబుతున్నారు.

First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...