Home /News /crime /

MUMABAI MAN SLASHES WIFE 30 TIMES WITH PAPER CUTTER FOR SPENDING TIME ON PHONE ARRESTED PAH

ఎంత చెప్పిన భార్య పాడు బుద్ధి మానుకోలేదు... ఫ్రస్టేషన్లో లో భర్త ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: భార్య ఎప్పుడు చూసిన మొబైల్ ఫోన్ లోనే మునిగిపోయి ఉండేది. భర్త ఎన్నిసార్లు చెప్పిన తన పద్ధతి మార్చుకొలేదు. దీంతో అతను రెచ్చిపోయాడు. భార్యను నోటికొచ్చినట్లు తిట్టి దాడిచేశాడు.

కొంత మంది ఫోన్ ను అతిగా ఉపయోస్తారు. అవసరం ఉన్నా లేకున్నా.. ఫోన్ లోనే మునిగిపోయి ఉంటారు. చుట్టు పక్కల జనాలు ఉన్నారన్న విషయం మరిచిపోతుంటారు. ఎప్పుడు పరధ్యానంలో ఉంటారు. మరికొంత మంది తమ పనులు కూడా మర్చిపోయి.. ఫోన్ లోనే సొల్లుమాటలు చెప్పుకుంటూ టైమంతా పాడుచేస్తుంటారు. కొన్ని సార్లు.. ఫోన్ వలన ఫ్యామిలీలు రోడ్డున పడిన అనేక సంఘటనలు జరిగాయి. కొంత మంది వివాహేతర సంబంధాలను నడిపిస్తున్నారు. వీడియో కాల్ చేసుకుంటూ.. దారుణాలకు పాల్పడుతున్నారు. ఫోన్ ను మంచికి కాకుండా దురలవాట్లకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని వలన కుటుంబం వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలోని (mumbai)  దహిసర్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. రహత్ (37) అనే వ్యక్తి.. తన భార్య మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడంపై కోపోద్రిక్తుడయ్యాడు. ఆమెకు అప్పటికే అనేక మార్లు చెప్పాడు. కానీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో.. భార్య రహత్ పై.. ఇంట్లో కుటుంబ సభ్యుల (brutally attack)  ముందే దాడిచేశాడు. ఆమెను పేపర్ కట్ చేసే బ్లేడుతో దాడిచేశారు.ముఖం, ఛాతీ , పొత్తి కడుపు, చేతుల మీద నరికాడు. చేతుల మీద దాదాపు.. 30 సార్లు పొడిచాడు. దీంతో లోతైన కత్తిగాట్లు పడ్డాయి. ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. ఆ తర్వాత.. అతను పారిపోయాడు. రహత్ రక్తపుమడుగులో కుప్పకూలి పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కూతురు మీరా రోడ్డులోని ఆసుపత్రికి తరలించారు. రహత్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా భార్యను హత్య చేసి ఆమె శవంతొో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు.

అమెరికాలోని (america)  ఫ్లోరిడాలో (Florida) దారుణమైన ఘటన జరిగింది. గత మంగళ వారం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జిచెన్ యాంగ్ అనే 21 ఏళ్ల యువకుడు, న్హు క్విన్ ఫామ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగిందో కానీ.. ఆమె ఇంట్లో చనిపోయింది. కొన్నిరోజులుగా జిచేన్ యాంగ్ ఇంటి నుంచి బైటకు రావడం లేదు. ఇంటి చుట్టుపక్కల వారు అనుమానంగా చూశారు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ఈ క్రమంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి ఇంట్లోకి ప్రవేశించారు.

అప్పుడు ఆమె రక్తపు మడుగులో బాత్రూంలోని ట్రబ్ లో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జిచెన్ ను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో జిచేన్ చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ కు గురయ్యారు. తన భార్యను గత మంగళ వారం చంపినట్లు అంగీకరించాడు. ఆమెను మెడ కోసి, నీటి ట్రబ్ లో వేశానని తెలిపాడు. (Man slit wife s throat) ఆ తర్వాత.. భార్యకు ఇష్టమైన పాటను ప్లేచేశానని తెలిపాడు. ఇంకా చెప్పలేని పనులు చేశానని కూడా పోలీసులతో అన్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Mobile, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు