విదేశాల్లో భార్య.. ప్రియురాలితో భర్త రాసలీలు.. కానీ అంతలోనే ఊహించని షాక్..

భార్య ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అప్పటినుంచి మహ్మద్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ(28)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని ప్రశ్నించేందుకు భార్య కూడా లేకపోవడంతో ప్రియురాలితో కలిసి మహ్మద్ ఇంటిలోనే సహజీవనం చేశాడు.

news18-telugu
Updated: June 29, 2020, 6:28 AM IST
విదేశాల్లో భార్య.. ప్రియురాలితో భర్త రాసలీలు.. కానీ అంతలోనే ఊహించని షాక్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఓ మహిళ ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఆమె భర్త ఇదే అదునుగా భావించి ఓ మహిళలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటిలో భార్య లేకపోవడంతో ప్రియురాలిని ఇంట్లో పెట్టుకుని సహజీవవనం చేశారు. నిత్యం రాసలీలల్లో మునిగి తేలే ఆ జంట ఉన్నట్టుండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించారు. అయితే ప్రియురాలి నగ్నంగా ఉరికి వేలాడుతూ కన్పించడం.. ఆమె శరీరంపై గాయాలు ఉండడం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా గుర్రాలగడ్డకు చెందిన మహ్మద్(35) భార్యతో కలిసి కొంతకాలం జీవనం సాగించాడు. అయితే భార్య ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది.

అప్పటినుంచి మహ్మద్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ(28)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని ప్రశ్నించేందుకు భార్య కూడా లేకపోవడంతో ప్రియురాలితో కలిసి మహ్మద్ ఇంటిలోనే సహజీవనం చేస్తున్నాడు. ఏమైందో తెలియదు గానీ ఉన్నట్టుండి ఇద్దరు ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవులుగా కన్పించారు. అయితే ప్రియురాలు నగ్నంగా ఉరికి వేలాడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రియురాలు శరీరంపై గాయాలు ఉండడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ప్రియురాలిని చంపేసి ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: June 29, 2020, 6:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading