హోమ్ /వార్తలు /క్రైమ్ /

Colorado Shooting : మొన్న మసాజ్ పార్లర్.. నేడు సూపర్‌ మార్కెట్‌..మరోసారి అమెరికాలో కాల్పుల మోత..

Colorado Shooting : మొన్న మసాజ్ పార్లర్.. నేడు సూపర్‌ మార్కెట్‌..మరోసారి అమెరికాలో కాల్పుల మోత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Colorado Shooting : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయ్. దుండుగులు జరుపుతున్న కాల్పుల్లో అమాయకులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ వద్ద దుండగులు జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారు సహా 10 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయ్. దుండుగులు జరుపుతున్న కాల్పుల్లో అమాయకులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ వద్ద దుండగులు జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారు సహా 10 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కారణాలేమి చెప్పకుండా దుండగులు విచక్షణరహితంగా సూపర్‌ మార్కెట్లో ప్రవేశించి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. బౌల్డర్‌ పోలీసు సీఎండీఆర్‌. కెర్రీ యమగుచి మీడియాతో మాట్లాడుతూ…ఈ ఘటనలో ఒకరిని అదపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. అయితే సూపర్‌ మార్కెట్‌ యజమాని మాట్లాడుతూ..ముగ్గురు సూపర్‌ మార్కెట్‌ వద్దకు వచ్చి కాల్పులు జరిపారని, ఇద్దరు పార్కింగ్‌ స్థలంలో, ఒకరు డోర్‌ వద్ద ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఘటన స్థలానికి చేరుకున్న భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరుస కాల్పులతో యూఎస్‌లో భయాందోళన నెలకొంది.

అయితే, గత రెండు రోజుల కిందట కూడా ఓ మసాజ్ పార్లర్లపై గుర్తు తెలియని దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 8 మంది వరకు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా దుండగుల వరుసగా రెచ్చిపోతుండటంతో భయాందోళన నెలకొంది. దుండగులు పాల్పుల్లో ఇప్పటికే చాలా మంది మృతి చెందారు.

ఇప్పటికే కాల్పులు జరిగిన సూపర్‌ మార్కెట్‌ ప్రాంతాన్ని భద్రత సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే సూపర్ మార్కెట్ ఆవరణలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సూపర్ మార్కెట్‌లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటికి తరలించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించారు. అయితే దుండగుడిని అరెస్టు చేసే ప్రయత్నంలో అతని గాయపర్చాల్సి వచ్చిందని బౌల్డర్‌ పోలీసు సీఎండీఆర్‌. కెర్రీ యమగుచి తెలిపారు. అరెస్టు చేసిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నారు.

First published:

Tags: Gun fire, Us shooting, USA

ఉత్తమ కథలు