అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఓ భూ వివాదానికి సంబంధించి సురేష్ అనే వ్యక్తి ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటన మీద రెవిన్యూ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. అయితే, విజయారెడ్డి మీద పెట్రోల్ పోసి హత్య చేసిన తర్వాత నిందితుడు సురేష్ ఏం చేశాడనేదానికి సంబందించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కాలిన శరీరంతో ఉన్న సురేష్ నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు.
విజయారెడ్డి మీద పెట్రోల్ పోసినప్పుడు ఆ మంటలు సురేష్‌కు కూడా అంటుకున్నాయి. ఈ క్రమంలో అతడి ఒంటి మీద దుస్తులు, శరీరభాగాలు కాలాయి. అయితే, శరీరం కాలినప్పుడు, హత్య చేసిన తర్వాత సాధారణంగా ఎవరైనా పరుగులు పెడుతూ వెళ్లారు. కానీ, సురేష్ మాత్రం కొంచెం వడివడిగా అడుగులు వేస్తున్నాడు. కానీ, పారిపోతున్నట్టుగా మాత్రం లేదు.
రోడ్డు మీద కాలిన గాయాలతో వెళ్తున్న సురేష్‌ను చూసినా సాధారణ పౌరులు ఎవరూ అతడిని ఆపలేదు. ఏమైందని కూడా ప్రశ్నించలేదు. విజయారెడ్డిని హత్యచేసిన తర్వాత డోర్ తీసుకుని సురేష్ ఇలా తీరిగ్గా నడుచుకుని వెళ్లిఉంటాడని ఈ వీడియోను చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.
పెట్రోల్ సీసాతో రావాలా.. ఓ రైతు ఆవేశం
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.