హోమ్ /వార్తలు /క్రైమ్ /

వంటింట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరీ రూ.20 లక్షల నోట్ల కట్టలను కాల్చేసిన భార్యాభర్తలు.. అసలేం జరిగిందంటే..

వంటింట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరీ రూ.20 లక్షల నోట్ల కట్టలను కాల్చేసిన భార్యాభర్తలు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ భార్యాభర్తలిద్దరూ నోట్ల కట్టలను వంటింట్లోకి తీసుకొచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల రూపాయలను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరీ కాల్చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

లంచం తీసుకున్న వ్యక్తికి అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిస్తే ఏం చేస్తారు? మహా అయితే లంచంగా తీసుకున్న డబ్బును ఎక్కడో ఓ చోట దాచేందుకు యత్నిస్తాడు. వేరే వాళ్లకు ఇచ్చి దాచి పెట్టమనో చేస్తాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆ డబ్బును దొరక్కుండా, కనపడకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఓ తహసీల్దార్ మాత్రం వింత పనికి పూనుకున్నాడు. ఇంటి తలుపులు మూసేసి, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇంట్లోకి రాకుండా చేసి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల రూపాయల డబ్బును కాల్చేశాడు. అది కూడా వంటింట్లో గ్యాస్ స్టవ్ ను ఆన్ చేసి మరీ కట్టలు కట్టలు డబ్బును కాల్చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే దీంట్లో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో పర్వత్ ను పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు. ఈ విషయం గురించి ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ముందుగానే ఎవరో సమాచారం ఇచ్చారు. అంతే అప్పటి వరకు తాను పలువురి వద్ద నుంచి లంచంగా తీసుకున్న డబ్బును ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చి బీరువాలో ఉన్న కట్టలకొద్దీ డబ్బును వంటింట్లోకి తీసుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

గ్యాస్ స్టవ్ ఆన్ చేశాడు. ఆ డబ్బును కాల్చేయడం మొదలు పెట్టాడు. అతడి భార్య కూడా డబ్బును కాల్చేయడంలో సహాయం చేసింది. ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ పెట్టాడు. ఇలా మొత్తం మీద ఏకంగా రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్టలను కాల్చేశాడు. ఈ లోపే ఏసీబీ అధికారులు అతడి ఇంటికి చేరుకున్నారు. వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. డబ్బును కాల్చేయొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా ఆ తహసీల్దార్ అదేపనిగా డబ్బును కాల్చేస్తూనే ఉన్నాడు. తలుపులు తీయమని చెప్పినా వినలేదు. దీంతో ఏసీబీ అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. మొత్తానికి ఈ ఘటనలో 20 లక్షల రూపాయలు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..

First published:

Tags: ACB, Black Money, Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Telangana

ఉత్తమ కథలు