నేనే నీ రాధ.. కిల్లర్‌కు ఎస్ఐ వల.. పెళ్లికూతురు గెటప్‌లో..

మధ్యప్రదేశ్‌లో ఓ హంతకుడిని పట్టుకోవడానికి ఓ మహిళా పోలీస్ ఏకంగా పెళ్లికూతురు గెటప్ వేసింది. మాధవి అగ్నిహోత్రి అనే ఎస్ఐ ఈ ట్రాప్ వేసింది.

news18-telugu
Updated: December 1, 2019, 3:08 PM IST
నేనే నీ రాధ.. కిల్లర్‌కు ఎస్ఐ వల.. పెళ్లికూతురు గెటప్‌లో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమాల్లో హీరో, హీరోయిన్లు దొంగలను పట్టుకోవడానికి వెరైటీ వెరైటీ గెటప్స్ వేయడం... చివరకు పట్టుకోవడం చూశాం. అయితే, నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో ఓ హంతకుడిని పట్టుకోవడానికి ఓ మహిళా పోలీస్ ఏకంగా పెళ్లికూతురు గెటప్ వేసింది. మధ్యప్రదేశ్‌లో మాధవి అగ్నిహోత్రి అనే ఎస్ఐ ఈ ట్రాప్ వేసింది. పెళ్లికూతురు గెటప్ వేసుకుని వెళ్లిన ఆమె నిందితుడిని పట్టుకుంది. బాలకృష్ణ చౌబే అనే 42 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ మీద మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పలు కేసులు ఉన్నాయి. అందులో కొన్ని మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అతడు మిస్ అయ్యేవాడు.

ఈ క్రమంలో పోలీసులకు అతడు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసినట్టు గుర్తించారు. అందులో నుంచి అతడి ఫొటోను సేకరించారు. మెల్లగా అతడి ఫోన్ నెంబర్ రాబట్టారు. అనంతరం ఎస్ఐ మాధవి అగ్నిహోత్రి రంగంలోకి దిగారు. ‘బాలయ్యా.. నేనే నీ రాధ. మనం పెళ్లిచేసుకుందాం.’ అని ట్రాప్ చేసింది. తాను ఢిల్లీలో ఉంటానని చెప్పింది. పెళ్లికి ముందు ఓసారి కలుసుకుని మాట్లాడుకుంటే.. ఆ తర్వాత నేరుగా మండపానికి వెళ్లిపోవచ్చని చెప్పింది. ఆ చర్చల కోసం ఓ గుడి వద్దకు రావాలని కోరింది. దీంతో నిందితుడు కూడా ‘తన రాధ’ కోసం వచ్చాడు. గుడి దగ్గరకు వచ్చీ రాగానే పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న యువతిని చూసి ఆనందంతో ఎగిరిగంతేశాడు. అయితే, ఆ వెంటనే పక్కన దాక్కున్న పోలీసులు అతడిని చుట్టుముట్టారు. అతడిని అరెస్ట్ చేశారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>