సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... న్యూస్‌పేపర్ ఓనర్‌పై కేసు నమోదు...

కొన్నాళ్లుగా ఈ హైటెక్ సెక్స్ రాకెట్ నడుస్తోందని పోలీసులకు దర్యాప్తులో తెలిసింది. దీని వెనకున్న ఏజెంట్లను కనిపెట్టే పనిలో పడ్డారు.

news18-telugu
Updated: July 13, 2020, 10:07 AM IST
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... న్యూస్‌పేపర్ ఓనర్‌పై కేసు నమోదు...
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... న్యూస్‌పేపర్ ఓనర్‌పై కేసు నమోదు... (File)
  • Share this:
మధ్యప్రదేశ్ పోలీసులు... కరోనా కేసుల డ్యూటీలో ఉండగా... కాల్ వచ్చింది. దాన్ని రిసీవ్ చేసుకున్న ఎస్సై... గుడ్... మేమ్ వెంటనే వస్తున్నాం... అంటూ బయల్దేరాడు. ఆయన వెంట కానిస్టేబుళ్లు కూడా వెళ్లారు. రతిబార్ ఏరియాకి వెళ్లారు. చుట్టూ చెట్లతో... ఎండ లేకుండా... నీడతో ఉంది ఆ ఏరియా. అక్కడ ఓ పాత బంగ్లా ఉంది. అదే మన టార్గెట్ అన్నాడు ఎస్సై. కానిస్టేబుళ్లు... ఎస్సార్... అని ముందుకు కదిలారు. భవనాన్ని చుట్టుముట్టారు. ఎస్సై... చేతిలో గన్నుతో... వేగంగా వెళ్లి... భవనం తలుపును గట్టిగా తట్టాడు. అది ముక్కలవ్వలేదుగానీ... మామూలుగా ఓపెన్ అయ్యింది. ఎస్సై హడావుడిగా లోపలికి వెళ్లి చూడగా... ఓ సోఫాలో... ఆరుగురు బాలికలు మద్యం మత్తులో తూలుతూ, ఊగుతూ ఉన్నారు. పోలీసుల్ని కూడా గుర్తిపట్టే పొజిషన్‌లో లేరు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

ఆ భవనం ఓ హిందీ డైలీ న్యూస్ పేపర్ యజమానిది. ఆరుగురు బాలికల్లో ఓ బాలిక... తనను భవన యజమాని 68 ఏళ్ల ప్యారే మియాన్ రేప్ చేశాడని స్టేట్‌మెంట్‌లో చెప్పింది. దాంతో... పోలీసులు అతనిపై సెక్స్ రాకెట్ కేసు, రేప్ కేసూ పెట్టి అరెస్టు చేశారు.

ప్రస్తుతం ఆ బాలికల్ని సిటీ చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించారు. తమను వేర్వేరు ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చి... బలవంతంగా సెక్స్ రాకెట్‌ నడుపుతున్నట్లు బాలికలు తెలిపారు. ఐతే... ఈ సెక్స్ రాకెట్ జరుగుతున్నది ఆ భవనంలో కాదనీ... వేరే చోట ఇదంతా చేస్తూ... ఆ రోజు మరో ప్రత్యేక అవసరం కోసం... ఆరుగుర్నీ అక్కడికి తరలించారని తెలిసింది. ఆ రోజు రాత్రి షాపురా ఏరియాలో జరిగే బర్త్‌డే పార్టీలో డాన్స్ చేయించడం కోసమే వాళ్లను అక్కడకు పంపినట్లు తెలిసింది. భవనం నుంచి ఎవరూ పారిపోకుండా... అందరికీ మద్యం పట్టించారు. ప్యారే మియాన్ సహచరురాలు... వాళ్లను అక్కడ బంధించినట్లు తెలిసింది. ఆమెను కూడా అరెస్టు చేశారు.

బాలికల్ని ప్రశ్నించినప్పుడు మరో విషయం కూడా తెలిసింది. వాళ్లను ఇంతకుముందు కూడా... చాలా పార్టీలకు తీసుకెళ్లి.. మద్యం తాగించారట. తెరవెనక సెక్స్ రాకెట్ నడుస్తోందని తెలుసుకున్న పోలీసులు... ప్యారే మియాన్... ఏజెంట్లు ఎవరు? బాలికల్ని ఎలా ఈ రాకెట్‌లో దించుతున్నారు? వంటి విషయాలు తెలుసుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading