MP MINISTER DAUGHTER IN LAW FOUND HANGING AT HIS ANCESTRAL HOME PVN
Sucide:మంత్రి కోడలు ఆత్మహత్య..కారణం అదేనట
మంత్రి కోడలు సవిత ఆత్మహత్య
Minister Daughter In Law Sucide : మృతదేహానికి సమీపంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటన గురించి తెలుసుకున్న కొద్దిసేపటికే మంత్రి, ఆయన కుమారుడు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.
Minister Daughter In Law Sucide : మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి కోడలు సవిత పర్మార్(23) ఆత్మహత్యకు పాల్పడింది. షాజాపుర్ జిల్లా పొంచానేర్ గ్రామంలోని తన నివాసంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం సవిత పర్మార్ ఉరి వేసుకుని చనిపోయింది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలుపగా. పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షాజాపూర్ పోలీసులు తెలిపారు. శవపరీక్ష నివేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
సవిత పర్మార్ (22) మూడు సంవత్సరాల క్రితం ఇందర్ సింగ్ పర్మార్ కుమారుడు దేవరాజ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. మంగళవారం సవిత ఆత్మహత్య సమయంలో, ఇందర్ సింగ్ పర్మార్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉండగా, సవిత భర్త దేవరాజ్ సింగ్ ప్రక్కనే ఉన్న గ్రామమైన మొహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హాజరైనట్లు సమాచారం. ఇంట్లో ఇతర బంధువులు ఉన్నారు. మృతదేహానికి సమీపంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటన గురించి తెలుసుకున్న కొద్దిసేపటికే మంత్రి, ఆయన కుమారుడు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.
మరోవైపు,మధ్యప్రదేశ్ దతియా జిల్లాలో దారుణం జరిగింది. పదే పదే డబ్బులు అడిగాడని.. ఓ ఆరేళ్ల బాలుడ్ని గొంతు నులిమి హత్య చేశాడు పోలీస్ హెడ్ కానిస్టేబుల్. అతడి మృతదేహాన్ని కారులో 70 కి.మీ. దూరం తీసుకెళ్లి.. గ్వాలియర్‌లోని నిర్జన ప్రదేశంలో పడేశాడు. ఈ ఘటన గత గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా తాను డిప్రెషన్లో ఉన్నానని, బాలుడు పదే పదే డబ్బులు అడిగేసరికి కోపంతా చంపినట్లు నిందితుడు రవి శర్మ ఒప్పుకున్నాడు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.