Extramarital Affair : మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు కట్టుకున్న భర్తల ప్రాణాలు,భర్తలు భార్య ప్రాణాలను తృణప్రాయంగా తీసేస్తున్నారు.అయితే తాజాగా వివాహేతర సంబంధం వద్దని చెప్పిన మహిళని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. విచక్షణా రహితంగా 16 సార్లు ఆమె శరీరంపై కత్తితో పొడిచాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతూల్ లో ఈ దారుణం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు బేతూల్ లోని సరణీ ప్రాంతంలో జరిగింది. బేతూల్ లో నివాసముండే రుబీనా, సందీప్ సాహుల మధ్య గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే తన కుమారుడు పెద్దవాడయ్యాడని ఇక నుంచి ఆ సంబంధాన్ని ఆపేద్దామని రుబీనా ఇటీవల సందీప్ ను కోరింది. దీనికి సందీప్ నిరాకరించాడు.
తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అయితే తన బాధ గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూనే ఉండేది రుబీనా. అయితే వివాహేతర సంబంధం వద్దు అని తాజాగా మరోసారి సందీప్ కు తెగేసి చెప్పింది. దీంతో కోపానికి గురైన సందీప్.. రుబీనా మెడ, వివిధ శరీర భాగాలపై విచక్షణారహితంగా కత్తితో 16 పోట్లు పొడిచాడు. వెంటనే రుబీనాను స్థానిక హాస్పిటల్ కు తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. నిందితుడు సందీప్ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు.
ALSO READ Intresting : మాట రాని మౌనమిది..చదివాకా చప్పట్లు కొట్టించే కథ ఈమెది
రుబీనాను గత రెండేళ్లుగా సందీప్ సాహు వేధిస్తున్నాడని మృతురాలి భర్త ఆసిఫ్ అలీ పోలీసులకు తెలిపాడు. ఆరు నెలల క్రితం కూడా సందీప్.. రుబీనా తల పగలగొట్టినట్లు చెప్పాడు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. అందుకే అప్పట్లో తామే ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటికి వెళ్లిపోయామని తెలిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు సందీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime news, Madhya pradesh