ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందని.. బాలికను కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు

ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగా స్థానికులు చూశారు. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఐతే బాలిక నుదుటిపై రాళ్లు బలంగా తగలడంతో ఆమె మరణించింది.

news18-telugu
Updated: September 9, 2020, 7:24 AM IST
ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందని.. బాలికను కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకప్పుడు పిల్లలు ఆరుబయట ఎంచక్కా ఆడుకునేవారు. గల్లీల్లో కబడ్డీ, క్రికెట్ వంటి గేమ్స్ ఆడుతూ సందడి చేసేవారు. కానీ ఇప్పుడా దృశ్యాలు కనిపించడం లేదు. పిల్లలంతా మొబైల్ చేతుల్లో పట్టుకొని ఆన్‌లైన్ గేమ్స్ ఆడేస్తున్నారు. మూడేళ్ల పిల్లాడి నుంచి ఇంజినీరింగ్ చదివే యువకుడి వరకు అంతా ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో బతుకుతున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లో ఓడిపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తమను ఓడించిన వారిపై పగలు ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. ఇంకొందరు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో హత్యలు కూడా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫ్రీ ఫైర్ ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందనే కోపంతో బాలికను హత్య చేశాడో బాలుడు.

ఇండోర్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. పక్కింట్లో ఉండే 10 ఏళ్ల బాలిక ఐదో తరగతి చదువుతోంది. ఇద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో గేమ్ ఆడేవారు. ఐతే ఫ్రీ ఫైర్ గేమ్‌లో ఆమె చేతిలో ఎప్పుడూ ఓడిపోయేవాడు ఆ బాలుడు. దాంతో ఆమెపై కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే తను ఇష్టంగా పెంచుకున్న ఎలుక కూడా మరణించింది. దాన్ని ఆ బాలికే చంపి ఉంటుందని అనుమానించాడు. ఐతే తనకేమీ తెలియదని..నేను చంపలేదని ఆమె చెప్పింది. ఐనప్పటికీ ఆమే ఈ పనిచేసి ఉంటుందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పూలకోసం బయటకు వెళ్లిన బాలికపై దాడి చేసి చంపేశాడు.

ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగా స్థానికులు చూశారు. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఐతే బాలిక నుదుటిపై రాళ్లు బలంగా తగలడంతో ఆమె మరణించింది. ఆ తర్వాత అతడు భయంతో పారిపోయాడు. బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ ఫుటేజీలో ఆ బాలుడి దృశ్యాలు కనిపించాయి. రంగంలోకి దిగిన పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బాలిక హత్య జరిగిన 2 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి జువైనల్ హోమ్‌కు తరలించారు. ఐతే ఈ హత్యలో బాలుడితో పాటు మరొకొరి హస్తం కూడా ఉందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 9, 2020, 7:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading