హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: సినిమా స్టైల్లో చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు

Andhra Pradesh: సినిమా స్టైల్లో చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు

సినిమా స్టైల్లో దొంగతనాలు

సినిమా స్టైల్లో దొంగతనాలు

దొంగలు ట్రెండ్ మారుస్తున్నారు.. సినిమా స్టైల్లో చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల జరిగిన ఓ చోరీ ఘటన దూమ్ సినిమాను గుర్తు చేసింది..

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18                               సినిమాల్లో దొంగతనాలను  కూడా చాలా అందంగా చూపిస్తారు. హీరోలనే దొంగలగా మార్చి తెలివిగా దొంగతనం చేసే సీన్లు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ధూమ్ సిరీస్ లో హృతిక్ రోషన్ డైమండ్ ను దొంగిలించే టెక్నిక్ చూస్తే  చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయితే అలాంటివి అన్నీ కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకుంటాం.. కానీ బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలో జరిగే దొంగతనాలను చూస్తే.. సినిమాల్లో జరిగే దొంగతనాలకు మించి ఫీట్లు కనిపిస్తాయి. ఈ మార్గంలో కోట్ల రూపాయల విలువ చేసే స్టాక్ తో పెద్ద కంటైనర్ల ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరఫరా అవుతుంటాయి. మొబైల్ ఫోన్లు.. టీవీలు.. కార్లు ఇలా ఎంతో విలువైన వస్తువులను కంటైనర్లు ద్వారా ఎగుమతులు దిగుమతులు చేస్తుంటారు. సాధారణంగా దొంగలు ఎవరూ లేని ఇళ్లను దోచుకుంటూ ఉంటారు. కానీ హైవే లో నయా ముఠా మాటు వేసి కంటైనర్ లోని సరుకును పూర్తిగా కాజేస్తోంది. వారు వేసిన స్కెచ్ మాములుగా ఉండదు.. నాలుగు సార్లు రెక్కీ.. నిర్వహించి ఐదో సారి  సమయం చూసి దోచేస్తారు.

వరుస హైవే దొంగతనాలకు చిరునామాగా మారుతోంది బెంగళూరు చెన్నై ఎక్స్ ప్రెస్ వే. 258 కిలోమీటర్ల పొడవుగల ఈ హైవేలో భారీ వాహనాలు నిరంతరం రవాణా సాగిస్తూనే ఉంటాయి. అధికంగా ఎలక్ట్రానిక్స్  కు సంబంధించిన రవాణా సాగుతుంటాయి. ఇలా రవాణా సాగిస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాలపై రెక్కీ నిర్వహిస్తారు దొంగల ముఠా సభ్యులు.. రెండు మూడు సార్లు వాహన రాకపోకలను క్షుణంగా తెలుసుకొని ఏ స్పాట్ లో చోరీ చేయాలో వ్యూహాన్ని రచించుకుంటారు. వరుసగా దొంగతనాలు చేస్తే పట్టుబడిపోతారు కాబ్బటి.. మూడు లేదా ఆరునెలలకు ఒక మారు సినిమాటిక్ విధానంలో దొంగతనం చేస్తున్నారు.

మొన్న నగరి సమీపంలో ఇదే తరహా హైవే చోరీ జరగగా... నిన్న తమిళనాడు సమీపంలోని క్రిష్ణగిరి దగ్గర కంటైనర్ లోని దాదాపు 4 కోట్ల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను దోచేశారు. తాజాగా 6 కోట్ల 50 లక్షలు విలువ చేసే ఎంఐ ఫోన్ లను కంటైనర్ల నుంచి అపహరించారు గుర్తు తెలియని దుండగులు. చెన్నై నుంచి బెంగళూరుకు వస్తున్న కంటైనర్ వెంటపడ్డారు. కర్ణాటక ఆంధ్ర బార్డర్ లోని పలమనేరు సమీపంలోని నెంగలి చెక్ పోస్ట్ దాటినా తరువాత ఎవరూ రారు అనుకున్న ప్రదేశంలో రన్నింగ్ కంటైనర్ పైకి ఒకరు ఎక్కగా.. మరో ఇద్దరు కంటైనర్ ముందుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసారు. ఎందుకు ఆపుతున్నారో తెలియని డ్రైవర్ కంట్రైనర్ ను నిలిపేశారు. వెంటనే డ్రైవర్ సురేష్ పైకి దాడికి దిగారు అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి డ్రైవర్ సురేష్ కాళ్ళు చేతులు చెట్టుకి కట్టేసి చితకబాదారు. అర్ధరాత్రి సమయం కావడంతో అటువైపు వేళ్లే భారీ వాహనాలు మినహా మరెవ్వరు రాలేదు. అయితే చెట్టుకు కట్టేసిన రమేష్ స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. దొంగలను  త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేస్తున్నట్లు  కోలార్ ఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. ఆంధ్ర., తమిళనాడులో ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటామని స్పష్టం చేసారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Theft

ఉత్తమ కథలు