MOTORCYCLE RIDER BEATEN TO DEATH AFTER SPAT OVER GIVING WAY PVN
Shocking : బైక్ కు దారి ఇవ్వలేదని..బస్సు డ్రైవర్ ని దారుణంగా కొట్టి చంపారు
ప్రతీకాత్మక చిత్రం
Motorcycle rider beaten to death : బైక్ కు దారి ఇవ్వలేదని ఓ బస్సు డ్రైవర్ ని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులిని అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
Motorcycle rider beaten to death : బైక్ కు దారి ఇవ్వలేదని ఓ బస్సు డ్రైవర్ ని దారుణంగా కొట్టి చంపారు. పూణెలోని ఆంద్గావ్ లో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభాష్ విఠల్ వాఘ్మారే (38) ముంబై అంధేరీలో ప్రైవేట్ లగ్జరీ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే లోనోవాలాలో ఉండే సుభాష్ అత్త మే 6న చనిపోయింది. అత్త చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సుభాష్ హడావుడిగా ముంబై నుంచి లోనావాలాకి బయల్దేరాడు. అయితే ఇదే క్రమంలో తన భార్య,పిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు వారు ఉంటున్న ఆంద్గావ్ కి దగ్గరి బంధువు రాజేశ్ అంకుష్ కుమార్తో కలిసి వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే ఉర్వడే- లవాసా రహదారి వద్ద రాజేంద్ర జగన్నాథ్ మోహోల్ అనే వ్యక్తి సుభాష్ బైక్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కోపంతో ఊగిపోయిన రాజేంద్ర జగన్నాథ్... వేగంగా సుభాష్ ను ఛేజ్ చేసి అతడి బైక్ కీ లాక్కున్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా వెళ్లింది గొడవ. దీంతో రాజేంద్ర..తన ఇద్దరు స్నేహితులు సంగ్రామ్ సురేశ్ మోహోల్, సమీర్ దీపక్ కర్పేకు ఫోన్ చేసి స్పాట్ కి రప్పించాడు. ముగ్గురు కలిసి సుభాష్ దాడి చేశారు. కాళ్లతో తంటూ, కర్రలతో దారుణంగా సుభాష్ ని కొట్టారు. తీవ్ర గాయాలతో సుభాష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులిని అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.