ఏడాది పాపతో అపార్ట్‌మెంట్ మీది నుంచి దూకిన తల్లి.. హైదరాబాద్‌లో విషాదం

భవనం నాలుగో అంతస్తు మీది నుంచి దూకడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: August 10, 2020, 4:02 PM IST
ఏడాది పాపతో అపార్ట్‌మెంట్ మీది నుంచి దూకిన తల్లి.. హైదరాబాద్‌లో విషాదం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఇటీవల ఆత్మహత్య కేసుల పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏడాది పాతో అపార్ట్‌మెంట్ మీది నుంచి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. భవనం నాలుగో అంతస్తు మీది నుంచి దూకడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఆ మహిళ ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది పాపతో పాటు తల్లి మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading