హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : చిన్న కొడుకు సహాయంతో పెద్దకొడుకుని కడచేర్చిన కన్నతల్లి .. వాళ్ల మధ్య అసలేం జరిగిందంటే..

OMG : చిన్న కొడుకు సహాయంతో పెద్దకొడుకుని కడచేర్చిన కన్నతల్లి .. వాళ్ల మధ్య అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMG: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లే పేగుబంధాన్ని తెంచుకుంది. కొడుకులు ప్రయోజకులు కాకపోయినా భరించే తల్లిదండ్రులు ఉన్న ఈరోజుల్లో కొడుకే తమకు భారంగా , పరువు హీనంగా మారాడాన్ని తట్టుకోలేకపోయింది. అందుకోసం ఏం చేసిందో తెలుసా..

  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లే పేగుబంధాన్ని తెంచుకుంది. కొడుకులు ప్రయోజకులు కాకపోయినా భరించే తల్లిదండ్రులు ఉన్న ఈరోజుల్లో కొడుకే తమకు భారంగా, పరువు హీనంగా మారాడాన్ని తట్టుకోలేకపోయింది. బ్రతికినంత కాలం కొడుకు వల్లే జరిగే అవమానాన్ని భరించడం కంటే కొడుకును కడతేర్చి ఆత్మహత్య(Suicide)గా చిత్రీకరించిన సంఘటన మెదక్ (Medak)జిల్లాలో కలకలం రేపింది. ఈ హత్యోదంతంలో చిన్న కొడుకును సహకారం తీసుకొని చివరకు రక్తం పంచుకొని పుట్టిన అన్న హత్యలో తమ్ముడికి భాగస్వామ్యుడ్ని చేసింది ఓ తల్లి. మెదక్ జిల్లాలో ఆ తల్లి ఒడిగట్టిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్తులతో బాటు బంధువులు ఆశ్చర్యపోయారు.

Thief Woman : పరిచయంతో అతనికి స్నేహితురాలైంది .. ఫ్రెండ్‌షిప్‌తో ఇంట్లో చేరి ఆమె అంత పని చేసింది..!

బిడ్డకు విషం పెట్టిన తల్లి..

మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన జరిగింది. 9నెలలు మోసి ..అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డకు చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించిన చేత్తోనే ఆ తల్లి విషం పెట్టి చంపింది.ఎవరూ ఊహించని ఈసంఘటన మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్‌ మండలం నాగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంగయ్య, భూమ్మా దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు దేవేందర్‌ మద్యానికి బానిసై ఇటీవలే చనిపోయాడు. బంధువులు మద్యం తాగడంతో పాటు చెడు వ్యసనాలకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. అయితే ఈ చావులో ట్విస్ట్ ఆలస్యంగా బయటపడింది. పెద్ద కొడుకు ప్రయోజకుడు కాకుండా మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఆ టార్చర్ భరించలేకపోయిన దేవేందర్ భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోవడంతో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పాటు చుట్టు పక్కల వాళ్లతో తాగి గొడవపడుతూ ఉండేవాడు దేవేందర్.

తల్లీ, కొడుకు దారుణం..

కొడుకు రోజూ పెట్టే చిత్రవధను భరించలేకపోయారు సంగయ్య, భుమ్మా. ఇలాంటి కొడుకు బ్రతికి ఉంటే నిత్యం చావాల్సి వస్తోందని భావించి ...పెద్ద కొడుకైన దేవేందర్‌ని హతమార్చడానికి కన్నతల్లి పథకం వేసుకుంది. అందులో భాగంగానే చిన్న కొడుకు సహకారంతో పెద్ద కొడుక్కి తాగిన మైకంలో ఉండగా అన్నంలో విషం కలిపి పెట్టి చంపేసింది. దేవేందర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందర్ని నమ్మించారు. అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం దేవేందర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానం గ్రామస్తులకు వచ్చింది. అదే వార్త పోలీసులకు చేరడంతో కేసును లోతుగా దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

Crime news : డబుల్ బెడ్రూం ఇళ్లిప్పిస్తామని డబ్బులు వసూలు .. మోసం చేసిన వాళ్లెవరో కాదు..

నేరాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం..

ఊరి జనంతో గొడవలు పడటం, దొంగతనాలు చేసి మద్యం తాగడం, ఇంటిపైకి గొడవలు తేవడంతో విసిగిపోయిన తల్లి భుమ్మా చిన్న కొడుకు సహకారంతోనే ఈ హత్య చేసినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అలాగే ఈ హత్యోదంతం బయటకు పొక్కకుండా చూసేందుకు గ్రామ పెద్దలు, మరికొందరు మధ్యవర్తులు ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈమొత్తం వ్యవహారంలో దేవేందర్‌ని హత్య చేసిన తల్లి, చిన్న కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు...హత్య విషయాన్ని దాచిపెట్టి ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించిన పలువురిపై కేసు నమోదు చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Medak, Mother killed her baby, Telangana crime news

ఉత్తమ కథలు