హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: ‘సాయం చేయండి.. మా అమ్మ, బాబాయ్ మా కళ్ల ముందే గదిలోకి వెళుతున్నారు’..

Shocking Incident: ‘సాయం చేయండి.. మా అమ్మ, బాబాయ్ మా కళ్ల ముందే గదిలోకి వెళుతున్నారు’..

రాజు మత్తులోకి జారుకోగానే ప్రియుడికి ఫోన్ చేసింది.

 మునేష్ తన స్నేహితులైన కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో అక్కడకు చేరుకున్నాడు. వారు ఐదుగురు కలిసి రాజు మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

రాజు మత్తులోకి జారుకోగానే ప్రియుడికి ఫోన్ చేసింది. మునేష్ తన స్నేహితులైన కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో అక్కడకు చేరుకున్నాడు. వారు ఐదుగురు కలిసి రాజు మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

తల్లిదండ్రులు పిల్లల ముందు ఏదైనా తప్పు చేస్తే ఆ పసి హృదయాలు ప్రభావితమవుతాయి. కొన్నికొన్ని సార్లు కన్న వాళ్లంటేనే భయపడి.. వాళ్ల దగ్గరకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అందుకే.. పిల్లలను తల్లిదండ్రులు ఎంత బుద్ధిగా పెంచాలో.. తల్లిదండ్రులు కూడా చిన్నారుల ముందు అంతే బుద్ధితో ప్రవర్తించాలి.

ఇంకా చదవండి ...

అహ్మదాబాద్: తల్లిదండ్రులు పిల్లల ముందు ఏదైనా తప్పు చేస్తే ఆ పసి హృదయాలు ప్రభావితమవుతాయి. కొన్నికొన్ని సార్లు కన్న వాళ్లంటేనే భయపడి.. వాళ్ల దగ్గరకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అందుకే.. పిల్లలను తల్లిదండ్రులు ఎంత బుద్ధిగా పెంచాలో.. తల్లిదండ్రులు కూడా చిన్నారుల ముందు అంతే బుద్ధితో ప్రవర్తించాలి. పిల్లలకు ఊహ తెలిశాక మరింత పెద్దరికంతో వ్యవహరించాలి. కానీ.. గుజరాత్‌లో ఓ కన్నతల్లి పెళ్లీడుకొచ్చిన కూతురు, టీనేజ్‌లో ఉన్న మరో కూతురు ఇంట్లో ఉండగా.. వాళ్ల కళ్ల ముందే తన భర్త తమ్ముడితో సరసాలు సాగించింది. మరిదితో రాసలీలలు సాగించిందే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. ఇద్దరినీ చంపేస్తామని బెదిరించారు. దీంతో.. ఆ ఇద్దరమ్మాయిలు భయంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉన్నారు.

అయితే.. ఇంటికి రావాలని తల్లి బలవంతం చేయడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరారు. తమ తల్లి.. బాబాయ్‌తో సంబంధం పెట్టుకుందని, ఈ విషయం బయట చెబితే చంపేస్తామని బెదిరించారని.. మీరే కాపాడాలని పోలీసులకు బాధిత యువతి ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్‌తో షాకైన పోలీసులు ఆ యువతిని కలిసి ఆరా తీశారు. అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఈ అమ్మాయిలతో మాట్లాడిన కౌన్సెలర్ వాళ్లు చెప్పిన విషయాలను వెల్లడించారు.

ఆ కౌన్సెలర్ చెప్పిన వివరాల ప్రకారం.. తొలుత.. కేవలం తమకు ఇంటికి వెళ్లడం ఇష్టం లేదని చెప్పిన ఆ అమ్మాయిలు తరువాత అసలు కారణం బయటపెట్టారు. బాబాయ్‌తో తమ తల్లి వివాహేతర సంబంధం కొత్తేమీ కాదని.. ఎప్పటి నుంచో నాన్నకు తెలియకుండా కొనసాగిస్తున్నారని వాళ్లు చెప్పారు. అయితే.. ఇటీవల కరోనా ఉపద్రవం సమయంలో తమ తండ్రి చనిపోయారని.. అప్పటి నుంచి మరింత చనువుగా ఇద్దరూ మెలగడం మొదలుపెట్టారని ఆ అమ్మాయిలు తెలిపారు. కొన్నిసార్లు తాము ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్లిద్దరూ గదిలోకి వెళ్లి శారీరక సంబంధం కొనసాగించేవారని.. అయితే ఈ విషయం తమకు తెలియడంతో ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధిత అమ్మాయిలు చెప్పారు.

ఇది కూడా చదవండి: Love Marriage: వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుడదా.. ప్రాణంతో సొంతూరు వెళ్లిన మనిషిని గోడ మీద శ్రద్ధాంజలి పోస్టర్లలో..

కౌన్సెలర్ సదరు మహిళను ఈ విషయంపై విచారించగా... తన మరిదితో సంబంధం ఉన్న మాట నిజమేనని ఆమె ఒప్పుకుంది. అంతేకాదు.. అతనితో కలిసి ఉండాలనుకుంటున్నానని చెప్పింది. తన కూతుర్లను బాగా చూసుకుంటానన్నాడని.. వాళ్లిద్దరూ తమతో వస్తే నలుగురం కలిసి ఉత్తరప్రదేశ్‌లోని తన మరిది సొంతూరికి వెళ్తామని ఆ అమ్మాయిల తల్లి చెప్పింది. అయితే.. తల్లి చేసిన నిర్వాకాన్ని కళ్లారా చూసిన బాధిత అమ్మాయిలు మాత్రం ఆమెతో కలిసి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమ బాబాయ్ మంచివాడు కాదని, తమను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని బాధిత అమ్మాయిలు వాపోయారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Illicit affair, Mother

ఉత్తమ కథలు