షాకింగ్..7 మాసాల పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి

Warangal News | వరంగల్‌ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడు మాసాల చిన్నారిని రూ.1000లకు అమ్మకానికి పెట్టింది ఓ తల్లి.

news18-telugu
Updated: August 13, 2019, 3:32 PM IST
షాకింగ్..7 మాసాల పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి
పసిపాపను రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి
  • Share this:
కన్నపేగు తెంచుకొని పుట్టిన పసికందును వదిలించుకోవడానికి ప్రయత్నించింది ఓ తల్లి. భర్తతో తగదాల నేపథ్యంలో కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పెంబర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఏడునెలల పాపను రూ.1000కు అమ్మకానికి పెట్టింది. వరంగల్ బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే తల్లి మాత్రం గత 20 రోజులుగా పాప ఆరోగ్యం సరిగా లేదని చెబుతోంది. అందుకే పాపనుఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చామని అంటోంది. భర్త పట్టించుకోకపోవడంతో బిడ్డను అమ్మకానికి పెట్టానని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పసిపాపను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
Published by: Sulthana Begum Shaik
First published: August 13, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading