అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని... కన్నకొడుకునే కడతేర్చిన తల్లి..!

తాను ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో వివాహం చేసినందుకు గానూ ఒక తల్లి దారుణానికి ఒడిగట్టింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని... కన్నకొడుకునే కడతేర్చింది..!

news18
Updated: November 14, 2020, 9:26 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని... కన్నకొడుకునే కడతేర్చిన తల్లి..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 14, 2020, 9:26 AM IST
  • Share this:
వివాహేతర సంబంధాలు కాపురాలను కూలదోస్తున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేశారనే కారణంతో కొందరు.. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేదని ఒకరు.. మనస్పర్థలతో ఒకరు.. ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవ. దీంతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కట్టుకున్నవారినే కాదు.. స్వయంగా తాము జన్మనిచ్చిన పిల్లలను కూడా చంపుతున్నారు. ఈ తరహా కేసులు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇదే తరహా కేసు నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి.. ఒక తల్లి నాలుగేళ్ల కొడుకును కడతేర్చినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో గురువారం అనుమానాస్పద స్థితిలో నాలుగేళ్ల బాలుడు మరణించాడు. తమకు దెయ్యం పూనిందని.. దెయ్యాలు మీద పడి తన కొడుకును చంపాయని బాలుడి తల్లి ఆరోపణ. ఇంట్లోవాళ్లను, గ్రామస్తులను, పోలీసులను అదే విధంగా చెప్పి నమ్మించింది ఆ తల్లి. కానీ ఇందులో ఏదో మతలబు దాగుందని పోలీసులు అనుమానించారు. ఆ తల్లిని విచారిస్తే అసలు విషయం తెలిసినట్లు సమాచారం.

తొర్తికి చెందిన నవ్యకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. తాళ్లరాంపూర్ కు చెందిన అభిషేక్ ఆమె భర్త. కానీ ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. నవ్య డిగ్రీ చదువుతూ ఉండగా.. ప్రేమ వ్యవహారం నడిపినట్టు సమాచారం. పెళ్లైన తర్వాత కూడా దంపతులిద్దరి మధ్య ఈ విషయానికి సంబంధించి గొడవలు జరిగాయి. పెద్దలు, పంచాయతీలు అన్నీ అయ్యాయి. ఎంతకూ నవ్యలో మార్పులేదు. దీంతో విసుగెత్తిన అభిషేక్.. నవ్యను తల్లిగారి ఇంటివద్దే వదిలేశాడు. ఇక ఇదే అదునుగా భావించిన నవ్య.. ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది. ఇందులో భాగంగానే.. నాలుగేళ్ల కొడుకును వదిలించుకోవాలనుకుంది. తల్లి పేగును తెంచాలనుకుంది. అనుకున్నదే తడువుగా.. బాలుడిని చున్నీతో కట్టి.. ఫ్యాన్ కు ఉరేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.

కాగా, ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నది. పోలీసులు.. నవ్యను విచారిస్తున్నారు. అయితే విచారణ సందర్భంగా నవ్య చెప్పిన దానిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దర్యాప్తు కొనసాగుతున్నదని.. విచారణ ముగిసిన తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: November 14, 2020, 9:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading