MOTHER SON DIED IN CYLINDER BLAST IN PEDDAPALLI DISTRICT BS
పెద్దపల్లి జిల్లాలో విషాదం.. సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవదహనం..
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో అర్ధరాత్రి విషాదం జరిగింది. గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి, తల్లీకొడుకు సజీవదహనమయ్యారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో అర్ధరాత్రి విషాదం జరిగింది. గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి, తల్లీకొడుకు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఇల్లు బుగ్గిపాలైంది. మృతులు గొట్టె యశోద(45), గొట్టె రోహన్(18)గా గుర్తించారు. రోహన్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడని, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, యశోద భర్త ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎండాకాలం కావడంతో అతడు ఇంటి బయట పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, పోలీసులు అనుమానిత కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.