హోమ్ /వార్తలు /క్రైమ్ /

Perambalur: ఇదెక్కడి మూర్ఖత్వం.. 70 రూపాయల కోసం కన్న కూతురుని పొట్టనపెట్టుకున్నావ్ కదమ్మా.. ఈ ఇంట్లోనే..

Perambalur: ఇదెక్కడి మూర్ఖత్వం.. 70 రూపాయల కోసం కన్న కూతురుని పొట్టనపెట్టుకున్నావ్ కదమ్మా.. ఈ ఇంట్లోనే..

తమిళనాడులోని పెరంబలూర్‌కు చెందిన మణిమేఘా, రాజా భార్యాభర్తలు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు మహాలక్ష్మి. వయసు 10 సంవత్సరాలు. పెరంబలూర్‌లోని వెప్పంతట్టై పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.

తమిళనాడులోని పెరంబలూర్‌కు చెందిన మణిమేఘా, రాజా భార్యాభర్తలు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు మహాలక్ష్మి. వయసు 10 సంవత్సరాలు. పెరంబలూర్‌లోని వెప్పంతట్టై పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.

తమిళనాడులోని పెరంబలూర్‌కు చెందిన మణిమేఘా, రాజా భార్యాభర్తలు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు మహాలక్ష్మి. వయసు 10 సంవత్సరాలు. పెరంబలూర్‌లోని వెప్పంతట్టై పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.

  పెరంబలూర్: అమ్మంటే దేవుడి ప్రతిరూపం అంటుంటారు. దేవుడు అన్నిచోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు. కానీ.. తమిళనాడులో ఓ కన్న తల్లి ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పెరంబలూర్‌కు చెందిన మణిమేఘా, రాజా భార్యాభర్తలు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు మహాలక్ష్మి. వయసు 10 సంవత్సరాలు. పెరంబలూర్‌లోని వెప్పంతట్టై పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఈ పాప తరచుగా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో డబ్బులు తీసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి కొనుక్కుని తింటూ ఉండేది. చాలాసార్లు ఇలా జరిగింది. చిన్న పాప తెలిసీతెలియక ఇలా చేస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు మందలించి వదిలేశారు. తల్లి మణిమేఘా ఇలా చేసినప్పుడల్లా కూతురిని తిడుతూ ఉండేది. కొన్ని సందర్భాల్లో కొట్టింది కూడా.

  ఇది కూడా చదవండి: OMG: 67 ఏళ్ల ముసలాడిని పెళ్లి చేసుకుంది.. అయ్యగారు శృంగారం చేసిన తీరుకు దెబ్బకు భయపడిపోయి..

  కానీ.. జనవరి 6న పదేళ్ల కూతురు మహాలక్ష్మి ఇంటికి దగ్గర్లో ఉన్న తన అంకుల్ అయిన మురుగన్ ఇంటికి వెళ్లింది. అయితే.. మురుగన్‌కు చెప్పకుండా హ్యాంగర్‌కు ఉన్న అతని షర్ట్ జేబులో నుంచి 70 రూపాయలు తీసుకుంది. డబ్బులు చూసుకుంటే కనిపించకపోవడంతో మురుగన్ మహాలక్ష్మి తీసిన విషయాన్ని గుర్తించాడు. నీ కూతురు ఇలా దొంగతనం చేసిందని మురుగన్ తన సోదరి అయిన మహాలక్ష్మి తల్లి మణిమేఘకు తెలియజేశాడు. పాపకు దొంగతనం అలవాటుగా మారుతోందని భావించిన తల్లి మణిమేఘ కఠినంగా శిక్షించాలని భావించి దారుణమైన నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి ఇంటికి తీసుకొచ్చి తిట్టి కొట్టింది.

  ఇది కూడా చదవండి: Sister In Law: వదినామరిది నైట్ లాడ్జికెళ్లారు.. వేకువజామున 3 గంటలకు మరిదికి మెలకువ వచ్చి చూసేసరికి..

  అంతేకాదు.. వేడి నీళ్లలో కారప్పొడి కలిపి ఆ ఆవిరి పీల్చమని మహాలక్ష్మిని బలవంతం చేసింది. లేకపోతే కొడతానని తల్లి బెదిరించడంతో పాప ఆ కారపు నీళ్ల ఆవిరిని పీల్చుకుని చాలా ఇబ్బంది పడింది. ఇంతటితో ఆ తల్లి వేసిన శిక్ష అవ్వలేదు. స్పూన్‌ను బాగా వేడి చేసి ఆ కాలే స్పూన్‌తో పాప నోటిపై, తొడలపై కాల్చింది. అప్పటికే ఆ వేడి కారపు నీళ్ల ఆవిరిని పీల్చి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, స్పూన్‌తో కాల్చడంతో మహాలక్ష్మి తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆమెకు జ్వరం వచ్చింది.

  ఇది కూడా చదవండి: OMG: 50 ఏళ్ల వయసులో కూడా ఇంత కామ కోరికలా.. ఆమెనూ, నిన్నూ ఏం చేయాలి అసలు..

  అంతేకాదు.. వేడి నీళ్లలో కారం వేసిన నీళ్ల ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు, కడుపు తీవ్రంగా పాడైపోయాయి. మూడు రోజుల పాటు ఆమె అన్నం కూడా తినలేకపోయింది. రోజువారీ కూలీలైన పాప తల్లిదండ్రులు చదువుకోలేదు. పాప పరిస్థితి విషమించడంతో ఆమెను కృష్ణపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుచ్చిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పాప చనిపోయింది. ఆమె మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతుంటే సరిదిద్దాలనుకోవడం తప్పు కాదు గానీ వారి ప్రాణాలు పోయేలా మూర్ఖంగా ప్రవర్తించడం సరికాదని పోలీసులు చెప్పారు.

  First published:

  Tags: Crime news, Mother, Tamilnadu

  ఉత్తమ కథలు