• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MOTHER RECORDS AS SON RAPES HIS GIRLFRIEND TO BLACKMAIL DUO ARRESTED BA

యువతిని కొడుకు రేప్ చేస్తుంటే.. ఎంకరేజ్ చేసిన తల్లి..

యువతిని కొడుకు రేప్ చేస్తుంటే.. ఎంకరేజ్ చేసిన తల్లి..

ప్రతీకాత్మక చిత్రం

తండ్రి ఇచ్చిన డబ్బులను ఆ తల్లీకొడుకులు బ్లాక్ మెయిల్ చేయడంతో రూ.4లక్షలు వారికి ఇచ్చేసింది.

  • Share this:
    తన కొడుకు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుంటే.. అడ్డుకోవాల్సిన తల్లి అతడిని ప్రోత్సహించింది. ఏకంగా వీడియో కూడా తీసింది. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. బలోడా బజార్‌కు చెందిన ఓ యువకుడు ఓ యువతితో స్నేహం చేసినట్టు నటించాడు. ఆమెను ఓ రోజు ఇంటికి పిలిచాడు. బాయ్ ఫ్రెండ్‌ను నమ్మి ఇంటికి వచ్చిన యువతికి.. అతడి తల్లి స్నాక్స్ చేసి పెట్టింది. అయితే, అందులో మత్తుపదార్థం కలిపింది. దీంతో ఆహారం తిన్న తర్వాత ఆ యువతి స్పృహకోల్పోయింది. ఆ తర్వాత ఆమెను తల్లీకొడుకు కలసి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ యువకుడు తన స్నేహితురాలి మీద అత్యాచారం చేస్తుంటే, దాన్ని ఆ తల్లి వీడియో తీసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో బాధితురాలు వారికి రూ.4లక్షలు చెల్లించింది. మరోవైపు ఈ విషయం తెలిసిన యువకుడి సోదరి, ఆమె భర్త కూడా బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. కానీ, తన వద్ద డబ్బులు లేవని యువతి చెప్పింది.

    ఆ యువతి తండ్రి పొలం విక్రయించగా రూ.6లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టాలంటూ కూతురికి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను ఆ తల్లీకొడుకులు బ్లాక్ మెయిల్ చేయడంతో రూ.4లక్షలు వారికి ఇచ్చేసింది. అదే సమయంలో ఆ డబ్బులు కావాలని తండ్రి అడగడంతో మిగిలిన రూ.2లక్షలు ఇచ్చింది. రూ.4లక్షలు ఏమయ్యాయని తండ్రి ప్రశ్నించడంతో బాధితురాలు బోరున ఏడ్చింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు