Home /News /crime /

దారుణం.. ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి..

దారుణం.. ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల భర్త మద్యానికి బానిసగా మారి నాగమణితో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ పడ్డారు.

    సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించి.. ధైర్యం చాలకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట విద్యానగర్‌లో నివాసముంటున్న ప్రశాంత్ కుమార్‌కు 2006లో పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నాగమణితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి కూతురు జ్యోతిమాధవి(9), కుమారుడు హర్షవర్థన్(6) ఉన్నారు. ఇటీవల భర్త మద్యానికి బానిసగా మారి నాగమణితో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ పడ్డారు. ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని సూర్యాపేట పట్టణంలోని సద్దెల చెరువు దగ్గరికి వెళ్లిన నాగమణి... వారిని చెరువులోకి తోసేసింది.

    తానూ ఆత్మహత్య చేసుకుందామని చెరువులోకి దిగింది. కానీ ధైర్యం చాలక పోవడం వల్ల ప్రయత్నం ఉపసంహరించుకుంది. తెల్లవారుజాము వరకు అక్కడే కూర్చొని విలపిస్తూ స్థానికుల కంటపడింది. మహిళ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సుర్యాపేట పోలీసులు వెల్లడించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Crime news, Suryapet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు